ఏపీ ఎన్నికల్లో మరింత వేడి రాజుకుంది. ఇప్పటికే ప్రధాన పార్టీలు వరసగా ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల జాబితాను విడుదల చేస్తున్నాయి. ఇప్పటికే రెండు దఫాలుగా అభ్యర్థులను ప్రకటించిన టీడీపీ, తాజాగా మూడో జాబితాను విడుదల చేసింది. ఇందులో 11 అసెంబ్లీ, 13 ఎంపీ స్థానాలకు అభ్యర్థుల్ని అధిష్టానం ప్రకటించింది. మైలవరం స్థానాన్ని వసంత కృష్ణ ప్రసాద్ కి కేటాయించగా, పెనమలూరును బోడే ప్రసాద్ కి కేటాయించారు. ఇప్పటి వరకు 128 స్థానాలకు అభ్యర్థుల్ని టీడీపీ ప్రకటించింది.