ఎన్నికల్లో పోటీ చేయకుండా తమ పార్టీని నిర్వీర్యం చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం గోడలపై పోస్టర్లను అంటించేందుకు అవకాశం లేకుండా చేశారని ఆ పార్టీ అగ్రనేత సోనియా గాంధీ ఆగ్రహం వ్యక్తం చేశారు. కాంగ్రెస్ బ్యాంకు ఖాతాల ఫ్రీజ్ చేయడం.. తమని ఆర్థికంగా కుంగదీయటమేనని అన్నారు. బీజేపీ అప్రజాస్వామిక విధానాలను అవలంభిస్తోందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు తమ పార్టీకే కాదని మొత్తం ప్రజాస్వామ్యానికే ప్రమాదకరం అని అన్నారు.