Prime Video – Telugu Movies: కొన్ని అప్‍కమింగ్ పాపులర్ తెలుగు సినిమాల డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను ప్రముఖ ఓటీటీ ప్లాట్‍ఫామ్ అమెజాన్ ప్రైమ్ వీడియో దక్కించుకుంది. మంగళవారం (మార్చి 19) ముంబై వేదికగా జరిగిన ప్రైమ్ వీడియో ప్రెజెంట్స్ ఈవెంట్‍లో ఇందుకు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి. 7 తెలుగు సినిమాలకు సంబంధించిన స్ట్రీమింగ్ హక్కుల గురించి ప్రైమ్ వీడియో ఈ ఈవెంట్‍లో ప్రకటించింది. థియేటర్లలో రిలీజ్, థియేట్రికల్ రన్ పూర్తయ్యాక ఆ సినిమాలు అమెజాన్ ప్రైమ్ వీడియో ఓటీటీలోకి రానున్నాయి. ఇప్పుడు ప్రకటించిన ఆ ఏడు సినిమాలు ఏవంటే..