మంచు లక్ష్మి హీరోయిన్‌గా నటించిన ‘ఆదిపర్వం’ మూవీ ట్రైలర్ లాంచ్ ఈవెంట్ హైదరాబాద్ లో జరిగింది. అయితే ఈవెంట్లో అందరూ మాట్లాడిన తర్వాత మంచు లక్ష్మి మాట్లాడింది. ఈ సందర్భంగా అనూహ్య ఘటన జరిగింది. స్టేజ్‌పై లక్ష్మి మాట్లాడుతుండగా ఒక ఫ్యాన్ వచ్చి తన కాళ్లు మొక్కాడు. అంతేకాకుండా ఆమెను చూస్తూ ఎమోషనల్ అయ్యాడు. దీంతో అక్కడ ఉన్న వారంతా ఒక్కసారిగా షాక్ కు గురయ్యారు.