హైదరాబాద్ :- ఉప్పల్ లో చేతులెత్తేసిన జెవి బిల్డర్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రియలేస్టేట్ కంపెనీ. పరారి లో కంపెనీ యాజమాన్యం వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు…పెట్టుబడుల పేరుతో అమాయకులను మోసం చేసి సుమారు 500 కోట్ల రూపాయల వసూలుకు పాల్పడి, ఉడాయించిన జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు.సుమారు 500 మంది ఏజెంట్ లేను ఏర్పాటు చేసుకొని, సుమారు 7000 మంది కొనుగోలు దారులను మోసం చేసిన జేవీ బిల్డర్స్ ఓనర్స్ వేలూరి లక్ష్మీ నారాయణ, జ్యోతి దంపతులు.భూమి కొనుగోలు కోసం పెట్టుబడి పథకం ద్వారా అధిక వడ్డీ లాభాన్ని చూపి భారీ మోసం…జనగామ ప్రాంత శివారులో తక్కువ రేట్ లలో భూములు తీసుకొని బై బ్యాక్ ఆఫర్ అని చెప్పి కొంతమందికి ఈ భూమిని గుంట లెక్కన ఫార్మ్ లాండ్ గా రిజిస్ట్రేషన్ చేసారు. కాని చాలా మంది కస్టమర్స్ కి అగ్రిమెంట్ మీదనే మినిమం లక్ష కట్టితే నెలకు 8000/- చొప్పున, 20 నెలలు 160000/- అని కొన్ని నెలలు ఇచ్చి అందరిని మోసము చేసిన వైనం…ఉప్పల్ పీఎస్ లో బాధితుల పిర్యాదు…గతంలో వీరిపై పలు చీటింగ్ కేసులు ఉన్నట్లు సమాచారం.