వింత శబ్దాలతో సైలెన్సర్లు పెడితే వాహనాలు సీజ్
అదేవిధంగా హెల్మెంట్ లేకుండా వాహనాలు నడపడం, పరిమితికి మించి వాహనంపై వెళ్లడంతో జరిమానాలు విధిస్తున్నామని తెలిపారు. ప్రధానంగా వాహనదారులు జరిమానాల నుంచి తప్పించుకునేందుకు రిజిస్ట్రేషన్ అయి ఉన్పప్పటికీ కొంత మంది వాహనదారులు నంబర్ ప్లేట్‌ను(Number Plate) తొలగించడం, ఉన్న నంబర్ ప్లేట్‌ను వంచడం, నంబర్ తుడిపివేయడం చేస్తున్నారని, దీనిని అసరాగా తీసుకుని కొంత మంది దొంగతనాలకు పాల్పడినప్పుడు నంబర్ లేని వాహనాలను ఉపయోగిస్తున్నారని అన్నారు. దీంతో చోరీలకు పాల్పడిన వారిని గుర్తించడం సవాల్‌గా మారుతోందన్నారు. దీనికి తోడు రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను గుర్తించడం కూడా కష్టంగా మారుతోందన్నారు. నేరాలను నియంత్రించడంతో పాటు రోడ్డు ప్రమాదాలకు గురైన వారిని గుర్తించేందుకు ఇలాంటి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మోటార్ వెహకిల్ నిబంధనల ప్రకారం వాహనదారులు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్(Driving License), వాహనానికి సంబంధించిన పత్రాలతో పాటు నంబర్ ప్లేట్ ఉండాలని, తనిఖీల సమయంలో వాహనాలకు నంబర్ ప్లేట్ లేకుండా రోడ్లపై తిరుగుతున్నప్పుడు పట్టుబడితే ఐపీసీ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి చట్ట పరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. అదేవిధంగా వింతశబ్దాలతో తోటి వాహనదారులను భయపెట్టేలా సైలెన్సర్లను అమరుస్తున్న ఆకతాయిలు వెంటనే వాటిని తొలగించాలని లేకుంటే వాహనాలు సీజ్ చేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై రవి, వెంకన్న, సాగర్,ట్రాఫిక్ సిబ్బంది పాల్గొన్నారు.