ఈడీ వాదనలు
తన అరెస్టు చట్టవిరుద్ధమని, దీనిపై కోర్టులో పోరాడతానని కవిత అన్నారు. శనివారం ఆమెను కోర్టులో హాజరుపరిచారు. కవిత తరఫు సీనియర్ న్యాయవాది విక్రమ్ చౌదరి వాదనలు వినిపించారు. ఈడీ అధికారులు అధికారాన్ని దుర్వినియోగం పాల్పడ్డారని వాదించారు. సుప్రీంకోర్టు(Supreme Court) కవిత పిటిషన్ పెండింగ్ లో ఉండగా ఈడీ చేసిందని కోర్టుకు తెలిపారు. ఈడీ తరఫున ప్రత్యేక న్యాయవాది జోహెబ్ హోస్సేన్ వాదిస్తూ… దర్యాప్తు సంస్థ ఎలాంటి బలవంతపు చర్య తీసుకోదన్నారు. సుప్రీంకోర్టు సహా ఏ కోర్టుకు కవిత పిటిషన్ పై ఎలాంటి ప్రకటన ఇవ్వలేదని వాదించారు. కవిత పిటిషన్ (Kavitha Petition)పై విచారణ సందర్భంగా ఈడీ కీలక విషయాలను ప్రస్తావించింది. కేసుకు సంబంధించిన ఆధారాలను కవిత ధ్వంసం చేశారని పేర్కొంది. మొదటి సమానుని జారీ చేసిన వెంటనే 5 పరికరాలలో 4 ఫోన్లని ఫార్మాట్ చేశారని తెలిపింది. కఠిన చర్యలు తీసుకోమని తాము ఎలాంటి అండర్ టేకింగ్ సుప్రీంకోర్టుకు ఇవ్వలేదని ఈడీ తరపు న్యాయవాదులు వాదించారు. పత్రికల్లో వచ్చిన వార్తలను బట్టి నిర్ణయానికి రావొద్దని అన్నారు.