నా మార్గంలో నిర్భయంగా ప్రయాణిస్తా
“బీఎస్పీ అధినేత్ర మాయామతికి(Mayawati) నేను హృదయపూర్వక ధన్యవాదాలు తెలుపుతున్నాను. నన్ను విశ్వసించినందుకు, నన్ను నడిపించినందుకు. మీరు ఎప్పటికీ నా హీరో. సామాజిక న్యాయం కోసం మాన్యవర్ కాన్షీరామ్ స్థాపించిన ఈ మిషన్‌ను నా జీవితాంతం నా మనస్సులో ఎల్లప్పుడూ ఉంచుకుంటాను. బహుజన రాజకీయ ప్రపంచంలో ఈ చిన్న ప్రయాణానికి అవకాశం కల్పించిన రాజ్యసభ ఎంపీ రామ్‌జీ గౌతమ్ కు ధన్యవాదాలు. నాపై విశ్వాసం ఉంచినందుకు ఈ దేశంలోని బహుజనులందరికీ నేను ఎప్పటికీ రుణపడి ఉంటాను. పవిత్రమైన రాజ్యాంగ విలువలు న్యాయం, స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వాన్ని కాపాడటంలో ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గబోనని, బహుజనులను నీతిమంతులుగా, స్వావలంబనతో, ముందుకు చూసేవారిగా మార్చేందుకు అవిశ్రాంతంగా కృషిచేస్తానని మీ అందరికీ నేను హామీ ఇస్తున్నాను. నా సొంత మార్గంలో నిర్భయంగా ప్రయాణిస్తాను. ఇది నా జీవితకాల మిషన్ అవుతుంది. నాకు అండగా నిలిచినందుకు తెలంగాణ, భారతదేశ ప్రజలకు ధన్యవాదాలు” అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్(RS Praveen Kumar) ట్వీట్ చేశారు.