Wednesday, October 16, 2024

Lok Sabha Election Schedule : మరికొద్ది సేపట్లో లోక్​సభ, ఏపీ ఎన్నికల షెడ్యూల్​ విడుదల..-2024 lok sabha election schedule live updates election commission of india bjp congress ,జాతీయ

లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ లైవ్​ అప్డేట్స్​..

2024 Lok Sabha Election schedule live updates : యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ని ఎన్నికల సంఘం ప్రకటించనుంది. ఆంధ్రప్రదేశ్​తో పాటు ఇతర రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ కూడా వెల్లడించనుంది.

Sat, 16 Mar 202407:17 AM IST

ఆంధ్రప్రదేశ్​ అసెంబ్లీ ఎన్నికలు

ఆంధ్రప్రదేశ్​లో మొత్తం 175 సీట్లు ఉన్నాయి. ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయాలంటే.. మెజారిటీ ఫిగర్​ 88ని దాటాలి. జగన్​ నేతృత్వంలోని వైసీపీ.. ఇక్కడ ప్రస్తుతం అధికారంలో ఉంది

Sat, 16 Mar 202407:00 AM IST

లోక్​సభ సీట్లు..

లోక్​సభలో మొత్తం 545 సీట్లు ఉంటాయి. వీటిల్లో 543 సీట్లకు ఎన్నికలు జరుగుతాయి. ఏప్రిల్​ నుంచి మే మధ్య వరకు పోలింగ్​ ప్రక్రియ సాగుతుంది. సాధారణంగా మే చివరి వారంలో ఫలితాలు వెలువడతాయి.

Sat, 16 Mar 202406:55 AM IST

మోదీ వర్సెస్​ ఇండియా కూటమి..

2024 లోక్​సభ ఎన్నికల్లో గెలిచి.. హ్యాట్రిక్​ సాధించాలని ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్​డీఏ భావిస్తోంది. మోదీని ఢీకొట్టి, ఆయన్ని గద్దెదించేందుకు.. విపక్ష ఇండియా కూటమి సన్నద్ధమవుతోంది. ఈ నేపథ్యంలో.. ఈ దఫా ఎన్నికలపై సర్వత్రా ఆసక్తి, అంచనాలు పెరిగిపోయాయి.

Sat, 16 Mar 202406:49 AM IST

3 గంటలకు ప్రెస్​ మీట్​..

ఎన్నికల తేదీలను ప్రకటించేందుకు.. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు ప్రెస్​ మీటింగ్​ని నిర్వహిస్తుంది ఈసీ.

Sat, 16 Mar 202406:49 AM IST

4 రాష్ట్రాల ఎన్నికల షెడ్యూల్​ కూడా..

లోక్​సభతో పాటు ఆంధ్రప్రదేశ్​, అరుణాచల్​ ప్రదేశ్​, సిక్కిం, ఒడిశాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​తో పాటు.. ఆయా అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్​ను కూడా ప్రకటించనుంది ఎన్నికల సంఘం

Sat, 16 Mar 202406:46 AM IST

మధ్యాహ్నం 3 గంటలకు..

యావత్​ భారత దేశం ఎదురుచూస్తున్న ఘట్టానికి సమయం ఆసన్నమైంది. 2024 లోక్​సభ ఎన్నికలపై ఎన్నికల సంఘం (ఈసీ) నుంచి కీలక అప్డేట్​ వచ్చింది. శనివారం మధ్యాహ్నం 3 గంటలకు.. లోక్​సభ ఎన్నికల షెడ్యూల్​ వెలువడనుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana