Wednesday, January 22, 2025

Gami, Bheema : గామి, భీమా ఫస్ట్ డే కలెక్షన్ల లెక్కలు ఇవే.. విశ్వక్ సేన్ సినిమాకే మూడు రెట్లు ఎక్కువంటూ

మహా శివరాత్రి పండుగ సందర్భంగా గామి, భీమా( Gami, Bheema ) సినిమాలు థియేటర్లలో విడుదల కాగా ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ వద్ద అదిరిపోయే స్థాయిలో కలెక్షన్లను సాధించాయి.గామి సినిమాకు 9 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు రాగా భీమా సినిమాకు 3 కోట్ల రూపాయల గ్రాస్ కలెక్షన్లు వచ్చాయి.

 Gaami Bheema Movies First Day Collections Details Here Goes Viral In Social Med-TeluguStop.com

విశ్వక్ సేన్( Vishwak Sen ) సినిమాకే మూడు రెట్లు ఎక్కువ మొత్తం కలెక్షన్లు వచ్చాయంటూ నెటిజన్లు కామెంట్లు చేస్తుండగా ఆ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

గామి సినిమాకు భారీ స్థాయిలో ప్రమోషన్స్ చేయడం ప్లస్ అయింది.

క్రౌడ్ ఫండ్ మూవీగా ఈ సినిమా తెరకెక్కగా తక్కువ బడ్జెట్ తో అదిరిపోయే క్వాలిటీతో ఈ సినిమా తెరకెక్కింది.గామి సినిమాకు క్రిటిక్స్ నుంచి కూడా పాజిటివ్ రివ్యూలు వచ్చాయనే సంగతి తెలిసిందే.

గామి సినిమా కోసం విశ్వక్ సేన్ ఎంతో కష్టపడ్డారు.ఐదేళ్ల పాటు గామి సినిమా షూటింగ్ జరుపుకోవడం గమనార్హం.

విశ్వక్ సేన్ సినిమాకు ఫస్ట్ వీకెండ్ వరకు కలెక్షన్ల విషయంలో ఢోకా లేదని చెప్పవచ్చు.10 కోట్ల రూపాయల రేంజ్ లో ఈ సినిమాకు బిజినెస్ జరగడంతో ఫస్ట్ వీకెండ్ సమయానికే ఈ సినిమా బ్రేక్ ఈవెన్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది.గామి సినిమా విశ్వక్ సేన్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ గా నిలిచే అవకాశాలు అయితే ఉన్నాయని చెప్పవచ్చు.విశ్వక్ సేన్ ను అభిమానించే ఫ్యాన్స్ సంఖ్య పెరుగుతోంది.

విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి ( Gangs of Godavari ) వచ్చే నెలలో విడుదల కానుంది.సినిమా సినిమాకు వైవిధ్యం ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్న విశ్వక్ సేన్ బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్ హిట్లను అందుకుంటున్నారు.రాబోయే రోజుల్లో విశ్వక్ సేన్ సక్సెస్ రేట్ మరింత పెరగాలని ఫ్యాన్స్ ఫీలవుతున్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana