Sunday, January 12, 2025

న్యూ ఇయర్, సంక్రాంతి రద్దీ- హైదరాబాద్ నుంచి తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు-hyderabad news in telugu sankranthi special trains 2024 to tirupati kakinada ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

తిరుపతి, కాకినాడకు ప్రత్యేక రైళ్లు

న్యూ ఇయర్, సంక్రాంతికి ప్రయాణికుల రద్దీ దృష్ట్యా పలు మార్గాల్లో దక్షిణ మధ్య రైల్వే ప్రత్యేక రైళ్లు నడుపుతుంది. హైదరాబాద్‌-తిరుపతి(07489, 07490) ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ సాయంత్రం 6.15 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.50 గంటలకు తిరుపతి చేరుకుంటుంది. మళ్లీ తిరుగు ప్రయాణంలో ఈ నెల 30వ తేదీ రాత్రి 8.25 తిరుపతిలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8.50కి హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌-తిరుపతి (07449,07450) మరో స్పెషల్‌ ట్రైన్‌ ఈ నెల 27న తేదీ సాయంత్రం 6.10కు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 6.45కు తిరుపతి చేరుకోనుంది. తిరుగు ప్రయాణంలో 28వ తేదీ సాయంత్రం 5.15 గంటలకు బయలుదేరి తర్వాత రోజు ఉదయం 7.30 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది. హైదరాబాద్‌-కాకినాడ (07451, 07452) ప్రత్యేక రైలు ఈ నెల 29వ తేదీ రాత్రి 8.30 గంటలకు హైదరాబాద్ లో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 8 గంటలకు కాకినాడ చేరుకుంటుంది. తిరుగు ప్రయాణంలో ఈ నెల 30న రాత్రి 9 గంటలకు కాకినాడలో బయలుదేరి తర్వాత రోజు ఉదయం 9.00 గంటలకు హైదరాబాద్‌ చేరుకుంటుంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana