తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగురవేసింది. వరంగల్ వెస్ట్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీనే విజయం అందుకుంది. బీఆర్ఎస్ నేత, సిట్టింగ్ ఎమ్మెల్యే దాస్యం వినయ్ భాస్కర్ కు 57,318 ఓట్లు రాగా.. కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచిన నాయిని రాజేందర్ రెడ్డి 72,649 ఓట్లు సాధించి హస్తం హవా చాటారు. దీంతో 15,331 ఓట్ల తేడాతో కాంగ్రెస్ అభ్యర్థి నాయిని రాజేందర్ రెడ్డి విజయం సాధించారు.