ఎమ్మెల్సీ జీవన్ రెడ్డిపై బీజేపీ ఎంపీ ధర్మపురి అర్వింద్ విమర్శలు గుప్పించారు. తనకు వ్యతిరేకంగా వచ్చిన కరపత్రాలు జీవన్ రెడ్డి వేయించారని ఆరోపించారు. ఇవేం పనులు అంకుల్ అంటూ అరవింద్ నిలదీశారు. తన తండ్రి స్నేహితుడైన మీరు తనకు తండ్రి లాంటివారని అన్నారు. జీవన్ రెడ్డిని కలిసిన ప్రతిసారి ఆశీర్వాదం తీసుకునేవాడినని చెప్పారు. బీజేపీకి ఎప్పు డు 3 వేల నుంచి 4 వేల ఓట్లు వచ్చేవని మొన్న ఎమ్మెల్యే ఎన్నికల్లో కాంగ్రెస్ కు దీటుగా ఓట్లు వచ్చాయని చెప్పారు. వచ్చే ఎంపీ ఎన్నికల్లో ఏ రేంజ్ లో తమకు ఓట్లు వస్తాయో తెలుసుకోండని సూచించారు.