టాటా కంపెనీల ప్రదర్శన ఇలా..
టాటా మోటార్స్, ట్రెంట్, టైటాన్, టీసీఎస్, టాటా పవర్లో ఏడాది కాలంగా మంచి ట్రాక్షన్ కనిపిస్తోంది. ఫలితంగా.. టాటా గ్రూప్ మార్కెట్ క్యాపిటల్ పెరుగుతూ వస్తోంది. ఏడాది కాలంలో.. టాటా గ్రూప్‌నకు చెందిన కనీసం 8 సంస్థలు.. రెండింతల సంపదను సృష్టించాయి! అవి.. టీఆర్ఎప్, బెనారెస్ హోటల్స్, టాటా ఇన్వెస్ట్మెంట్ కార్పొరేషన్, టాటా మోటార్స్, ఆటోమొబైల్ కార్పొరేషన్ ఆఫ్ గోవా, ఆర్టిసన్ ఇంజీనిరింగ్. వీటితో పాటు.. వచ్చే ఏడాదిలో మార్కెట్లో లిస్ట్ అవ్వనున్న టాటా క్యాపిటల్ మార్కెట్ వాల్యూ.. 2.7 లక్షల కోట్లుగా ఉంది.