జూబ్లీహిల్స్లో దుర్గానగర్లో గత బుధవారం సంపులో శవమై కనిపించిన బాలుడి కేసును పోలీసులు చేధించారు. అనుమానాస్పద స్థితిలో మృతిచెందిన బాలుడి వ్యవహారంలో కొత్త కోణం వెలుగు చూసింది. రోడ్ 5లోని దుర్గాభవానీనగర్ బస్తీలో ఉంటున్న ముదావత్ రమేష్, కవితల రెండో కుమారుడు కార్తిక్ అలియాస్ పండు(10) గత మంగళవారం రాత్రి ఆడుకోవడానికి వెళ్లి అదృశ్యం అయ్యాడు. స్థానికుల గాలింపులో బుధవారం ఉదయం పార్కు లోపల ఉన్న డ్రైనేజీలో మృతి చెంది కనిపించాడు. బాలుడిని ఎవరో చంపేశారని తల్లి ఆరోపించింది.