“హైదరాబాద్ నగర అభివృద్ధికి గత ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలను కొనసాగిస్తూనే, మరింత ఉన్నతంగా నగరాన్ని అభివృద్ధి చేసేందుకు చర్యలు తీసుకుంటాం. తెలంగాణ అభివృద్ధికి మెగా మాస్టర్ ప్లాన్ తీసుకొస్తాం. త్వరలో 2050 మెగా మాస్టర్ ప్లాన్ తీసుకు రాబోతున్నాం. అర్బన్, సెమీ అర్బన్, రూరల్ మూడు భాగాలుగా అభివృద్ధిని ముందుకు తీసుకెళతాం. ఔటర్ రింగ్ రోడ్డుకు సమీపంలోని 25వేల ఎకరాల్లో హెల్త్, స్పోర్ట్స్, కాలుష్య రహిత పరిశ్రమలతో ఒక సిటీని ఏర్పాటు చేయబోతున్నాం. మెట్రో రద్దు కాలేదు, ప్రజలకు ఉపయోగపడేలా మెట్రో విస్తరణ చేయబోతున్నాం. ఫార్మా సిటీలు కాదు. ఫార్మా విలేజ్ లు ఏర్పాటు చేస్తాం. అపోహలు వద్దు. మా ప్రభుత్వానికి స్పష్టమైన విధానం ఉంది. మాకు మేమే మేధావులమని భావించం. అనుభవజ్ఞులు, నిపుణుల సలహాలతో ముందుకెళతాం. గతంలో సృష్టించిన సమస్యలను పరిష్కరిస్తూ, భవిష్యత్ ప్రణాళికలు రూపొందిస్తూ ముందుకెళతాం” అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.