కాబట్టి, భార్య బర్త్ డేను అమెరికాలో సెలబ్రేట్ చేయాలనే ఉద్దేశంతో చిరంజీవి ఈ టూర్ వేసినట్లు తెలుస్తోంది. చిరంజీవి పెట్టిన పోస్ట్‌కు వేలల్లో లైక్స్, కామెంట్స్ వెల్లువెత్తుతున్నాయి. దానిపై వరుణ్ తేజ్ స్పందిస్తూ బ్లాక్ హార్ట్ ఉన్న ఎమోజీని షేర్ చేశాడు. అంతేకాకుండా తాజాగా యూఎస్‌లో జరిగిన ఓ వివాహ వేడుకలో అల్లు అరవింద్, వెంకటేష్ ఇలా అందరూ కలిసి కనిపించారు. ఆ ఫొటోల్లో చిరంజీవి లుక్ చూసి అభిమానులు, ప్రేక్షకులు ఫిదా అవుతున్నారు.