Friday, October 18, 2024

పటిష్ఠ స్థితిలో భారత్‍.. అదరగొట్టిన యశస్వి, గిల్.. ఆధిక్యం ఎంతంటే..-ind vs eng 3rd test highlights team india in commendable position against england yashasvi jaiswal gill are stars ,cricket న్యూస్

80 బంతుల్లో యశస్వి అర్ధ సెంచరీకి చేరుకున్నాడు. మరోవైపు గిల్ ఆచితూచి ఆడాడు. అయితే, జైస్వాల్ మాత్రం గేర్ మార్చి దూకుడు కంటిన్యూ చేశాడు. ఇంగ్లిష్ బౌలర్లందరినీ బాదేశాడు. 122 బంతుల్లోనే సెంచరీ యశస్వి జైస్వాల్ మార్క్ చేరాడు. తన ఏడో టెస్టులోనే మూడో టెస్టు శకతంతో అలరించాడు. అయితే, కాసేటికే ఇబ్బందిగా అనిపించడంతో రిటైర్డ్ హర్ట్‌గా పెవిలియన్‍కు వెళ్లాడు. గిల్ 98 బంతుల్లో అర్ధ శతకం చేశాడు. యంగ్ ప్లేయర్ రజత్ పటిదార్ (0) 10 బంతులు ఆడి ఇంగ్లిష్ స్పిన్నర్ హార్ట్లీ బౌలింగ్‍లో డకౌట్ అయ్యాడు. ఆ తర్వాత వచ్చిన కుల్‍దీప్.. గిల్‍ నిలకడగా ఆడి రోజును ముగించారు. నాలుగో రోజు గిల్, కుల్దీప్ టీమిండియా రెండో ఇన్నింగ్స్ కొనసాగిస్తారు. ఇప్పటి వరకు 322 పరుగుల ఆధిక్యం సాధించిన భారత్.. ఇంగ్లండ్ ముందు భారీ టార్గెట్ ఉంచడం ఖాయంగా కనిపిస్తోంది. నాలుగు, ఐదు రోజుల్లో పిచ్ స్పిన్‍కు ఎక్కువగా సహకరించే అవకాశం ఉండటంతో టీమిండియాకు గెలుపు అవకాశాలు మెండుగా ఉన్నాయి.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana