Yash: కన్నడ స్టార్ హీరో యశ్‌కు ఫుల్ క్రేజ్ ఉంది. కేజీఎఫ్ 1, 2 చిత్రాలతో ఆయన పాన్ ఇండియా హీరో అయ్యారు. రాకీ భాయ్‌గా దేశవ్యాప్తంగా ఫుల్ పాపులర్ అయ్యారు. అయితే, ఎంత స్టార్ డమ్ ఉన్నా యశ్ సింపుల్‌గా ఉండేదుకు ఇష్టపడతారు. ఆయన మాటలు కూడా అదే విధంగా ఉంటాయి. యశ్ మాట్లాడిన కొన్ని మాటలు గతంలో సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే, తాజాగా యశ్ మరోసారి తన సింప్లిసిటీ ప్రదర్శించారు.