ఇవాళ(ఫిబ్రవరి 17) కేసీఆర్ పుట్టినరోజు కావటంతో… పలు రాజకీయ నేతలు, సినీ ప్రముఖలు బర్త్ డే విషెస్ చెబుతున్నారు. ఈసారి వేడుకలకను ఘనంగా నిర్వహించాలని బీఆర్ఎస్ పార్టీ ఇప్పటికే నిర్ణయించింది. తెలంగాణ భవన్లో ఏర్పాట్లు కూడా చేస్తున్నారు. ఈ సందర్భంగా ఆటో డ్రైవర్లకు శుభవార్త అందించింది బీఆర్ఎస్. 1000 మంది ఆటో డ్రైవర్లకు రూ.లక్ష చొప్పున మొత్తం రూ.10 కోట్ల రూపాయల విలువైన ప్రమాద, ఆరోగ్య బీమా పత్రాలను అందించనుంది. అంతేకాకుండా వికలాంగులకు వీల్ఛైర్స్ పంపిణీ తదితర సేవా కార్యక్రమాలు చేపట్టనుంది. కేసీఆర్ జన్మదిన వేడుకలను అన్ని గ్రామాల్లోనూ ఆ పార్టీ నేతలు నిర్వహిస్తున్నారు. సోషల్ మీడియా వేదికగానూ పోస్టులు చేస్తున్నారు.