జుట్టు సంరక్షణ ఎంత ముఖ్యమో… వాటికి హెయర్ డ్రయర్లు వాడడం, హెయిర్ కర్లింగ్, హెయిర్ స్ట్రెయిటనింగ్ వంటివి చేయడం మానేయడము అంతే ముఖ్యం. వెంట్రుకలను అధిక వేడికి గురి చేయడం వల్ల అందులో ఉన్న తేమ మొత్తం పోతుంది. దీనికి వెంట్రుకలు సులువుగా విరిగిపోతాయి. జుట్టు పెరగడానికి కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. అలాంటి వాటిని ఎంపిక చేసుకుని రోజూ తినడం అలవాటు చేసుకోవాలి. ఉడకబెట్టిన గుడ్డును ప్రతిరోజూ తింటే ఎంతో మంచిది. ఉసిరి కాయలను రోజుకు ఒకటి తింటూ ఉండాలి. ఉసిరి జ్యూస్ తాగినా మంచిదే. మజ్జిగ తాగడం వల్ల కూడా జుట్టు ఒత్తుగా పెరుగుతుంది. బాదం పప్పులను రాత్రి నానబెట్టి ఉదయం తింటే ఎంతో మంచిది.