రాష్ట్రంలో 8,180 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ గ్రూప్ – 4 నోటిఫికేషన్ ఇవ్వగా….. జూలై 1న పరీక్ష నిర్వహించారు. ఈ పరీక్ష కోసం మొత్తం 9,51,205 మంది అప్లై చేయగా….అందులో 7,62,872 మంది పేపర్ -1 రాయగా….7,61,198 మంది పేపర్ -2 పరీక్ష రాశారు.ఇక 5 నెలల క్రిందటే ఫైనల్ కీ విడుదల కాగా….గ్రూప్ -4 మెరిట్ జాబితా వివరాలను ఇవాళ విడుదల చేశారు. అనంతరం అభ్యర్థులకు ర్యాంకు కేటాయించనున్నారు. మార్కుల ఆధారంగా జిల్లాలు, జోన్లవారీగా పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. ఇందుకు సంబంధించిన వివరాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ త్వరలోనే ప్రకటించే అవకాశం ఉంది. మరోవైపు గ్రూప్ 1 అభ్యర్థుల వయోపరిమితిని పెంచనున్నట్లు తెలంగాణ సర్కార్ ప్రకటించింది.