అల్పాహారంలో కోడి గుడ్డు తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉంటాయి. కోడిగుడ్లలో మనకు అవసరమైన పొటాషియం, ఐరన్, జింక్, విటమిన్ ఇ ఉంటాయి. అలాగే ప్రోటీన్స్ సమృద్ధిగా ఉంటుంది. ఇవన్నీ మన ఆరోగ్యాన్ని కాపాడతాయి. అలాగే కండరాలను బలంగా మార్చేందుకు ఉపయోగపడతాయి. రోజంతా మనకు కావాల్సిన శక్తిని అందిస్తాయి. కిచిడీలో పెసరపప్పు ఉంటుంది. కాబట్టి ఇది ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. కోడిగుడ్డులో ఉన్న ఐరన్‌ను శరీరం త్వరగా శోషించుకోగలదు. కాబట్టి గర్భిణులు, పాలిచ్చే తల్లులు కోడి గుడ్డును ప్రతిరోజూ తినడం అవసరం. అది కూడా ఉడకబెట్టిన కోడి గుడ్డును తింటే మరీ మంచిది. రొమ్ము క్యాన్సర్ రాకుండా ఉండాలన్న కూడా ప్రతిరోజూ కోడిగుడ్డును తింటే ఉత్తమం. జుట్టు, చర్మం ఆరోగ్యంగా కాంతివంతంగా ఉండాలంటే ప్రతిరోజు కోడిగుడ్డును తినాలి. దీనిలో ఉండే పోషకాలు చర్మాన్ని మెరిపిస్తాయి. నరాల బలహీనత ఉన్నవారు కోడి గుడ్డుతో చేసిన ఆహారాలను అధికంగా తినడం అలవాటు చేసుకోవాలి. ఒకసారి ఈ కోడి గుడ్డు కిచిడీని ప్రయత్నించండి. ఇది చాలా టేస్టీగా ఉంటుంది త్వరగా పొట్ట నిండుతుంది.