మాజీ ప్రధాని వాజ్‌పేయి జయంతి వేడుకలను ఏపీ బీజేపీ నేతలు ఘనంగా నిర్వహించారు. విజయవాడలోని రాష్ట్ర ఆఫీసు హాయిలో నిర్వహించిన వాజ్‌పేయి జయంతి వేడుకల్లో పాల్గొన్న ఏపీ బీజేపీ అధ్యక్షురాలు పురందేశ్వరి.. అప్పుడు జరిగిన అభివృద్ధిని వివరించారు. ఈ సందర్భంగా చంద్రబాబుకు ఇండైరెక్ట్ గా కౌంటర్ ఇచ్చారు. మెుబైల్ కమ్యూనికేషన్ అండ్ మెుబైల్ ఫోన్లు తెచ్చామని కొందరు చెప్పుకుంటారని అన్నారు.అసలు ఆ వ్యవస్థని వాజ్‌పేయి తెచ్చామని ఆమె తెలిపారు. గ్రామీణ ప్రాంత రోడ్లు ఎక్కువ వాజ్‌పేయి హయంలో వేశారని చెప్పుకొచ్చారు.