1988 డిసెంబర్ 26న
వంగవీటి రాధాకృష్ణ 1974లో రాజకీయ కక్షల్లో హత్యకు గురయ్యారు. ఆయన వర్గానికి అండగా ఉండడానికి తప్పని సరిపరిస్థితుల్లో వంగవీటి మోహన్ రంగా బెజవాడ రాజకీయాల్లోకి ఎంటరయ్యారు. అప్పటి నుంచి దాదాపు 15 ఏళ్ల పాటు రంగా విజయవాడ రాజకీయాలు శాసించారు. దేవినేని సోదరులతో విభేదాలు, రాజకీయ హత్యలు బెజవాడ చరిత్రనే మార్చేశాయి. కాంగ్రెస్, కమ్యునిస్టు పార్టీలు కీలకంగా ఉన్న బెజవాడ రాజకీయాల్లోకి అనూహ్యంగా టీడీపీ ఎంటర్ అయ్యింది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మోహన్ రంగా…టీడీపీ ప్రభుత్వం గట్టిగా ఎదుర్కొనేవారు. పేద, బలహీన వర్గాల నాయకుడిగా రంగాకు మాస్ లో ఇమేజ్ వచ్చింది. ఇక కాపు సామాజిక వర్గాన్ని ఏకతాటిపైకి తెచ్చేందుకు ఆయన చేసిన ప్రయత్నాలతో పెద్ద ఎత్తున అభిమానాన్ని సంపాధించుకున్నారు. 1988 డిసెంబర్ 26న పేదల ఇళ్ల పట్టాల కోసం నిరాహార దీక్ష చేస్తున్న రంగా… ఆయన ప్రత్యర్థులు అతి దారుణహత్యకు హత్య చేశారు. ఆ తర్వాత బెజవాడలో జరిగిన అల్లర్లు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు.