Wednesday, October 30, 2024

బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలే లక్ష్యంగా బడ్జెట్-andhra pradesh assembly vote on account budget live updates 2024 ,ఆంధ్ర ప్రదేశ్ న్యూస్

బడ్జెట్‌ ప్రతిని సిఎంకు అందచేస్తున్న ఆర్థిక మంత్రి

AP Assembly Budget Live Updates: ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్న బడ్జెట్‌కు రాష్ట్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. ఉదయం 11గంటలకు ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్‌ బడ్జెట్‌ను ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి ప్రవేశ పెడతారు.

Wed, 07 Feb 202405:45 AM IST

చాణక్యుడి పాలన అందిస్తున్నాం…

విభజన అనంతరం ప్రతికూల పరిస్థితుల్లో కూడా అత్యంత పురోగతి సాధించ గలిగినట్టు బుగ్గన చెప్పారు. రాష్ట్ర విభజన తర్వాత జటిలమైన విభజన సమస్యలతో రాష్ట్రాన్ని పునర్నిర్మాణం కోసం కృషి చేస్తున్నట్లు చెప్పారు. ఐదేళ్లలో ప్రజల జీవితాల్లో వెలుగులు నింపుతున్నట్లు చెప్పారు. నవరత్నాల ద్వారా అందిస్తున్న వినూత్న కార్యక్రమాలతో ప్రపంచ మేధావుల అభినందనలు అందుకుంటున్నట్లు చెప్పారు. తక్కువ సమయంలో ప్రజల జీవితాల్లో గణనీయమైన మార్పు తీసుకొచ్చామన్నారు.

Wed, 07 Feb 202405:42 AM IST

అంబేడ్కర్ బాటలో సాగుతున్నాం…

అంబేడ్కర్‌ నివాళి అర్పిస్తూ స్టాట్యూ ఆఫ్ సోషల్ జస్టిస్‌ ఏర్పాటు ద్వారా అంబేడ్కర్‌ ఆశయాలు తమ ప్రభుత్వానికి మార్గదర్శకం వహిస్తున్నాయని చెప్పారు. దార్శనికుల ఆలోచనల్ని కార్యరూపంలోకి తెచ్చిందని బుగ్గన చెప్పారు. అసమానతలు రూపుమాపడం, నాణ్యమైన విద్య, జీవనోపాధికి సాయం చేయడం, సుస్థిరమైన అభివృద్ధికి ఇవన్నీ అవసరమని భావిస్తున్నాం. వాగ్ధానాల అమలు, ప్రజల అకాంక్షల అమలులో చిత్తశుద్ధిని నిరూపించుకున్నాం.

Wed, 07 Feb 202405:37 AM IST

ఏపీ అసెంబ్లీలో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలను నూటికి నూరుశాతం అమలు చేయాలనే లక్ష్యంతో ఐదేళ్లు పనిచేసినట్టు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి చెప్పారు. ఏపీ అసెంబ్లీలో ఐదోసారి బడ్జెట్‌ ప్రవేశపెట్టే అవకాశం లభించినందుకు హర్షం వ్యక్తం చేశారు. సమాజంలో అట్టడుగు వర్గాల ప్రయోజనాలను కాపాడటానికి తమ ప్రభుత్వం కృషి చేసిందన్నారు.

Wed, 07 Feb 202405:23 AM IST

ప్రైవేట్ యూనివర్శిటల సవరణ బిల్లుకు అమోదం

ఆంధ్రప్రదేశ్‌ ప్రేవేట్‌ యూనివర్శిటీస్‌ (ఎస్టాబ్లిస్‌మెంట్‌ అండ్‌ రెగ్యులేషన్‌) యాక్ట్‌ 2016కు సవరణలు చేయడం ద్వారా బ్రౌన్‌ఫీల్డ్‌ కేటగిరిలో మూడు ప్రేవేట్‌ యూనివర్శిటీలకు అనుమతి ఇస్తూ క్యాబినెట్ అమోదం తెలిపింది. అన్నమయ్య జిల్లా రాజంపేటలో అన్నమాచార్య యూనివర్శిటీ, తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలో గోదావరి గ్లోబల్‌ యూనివర్శిటీ, కాకినాడ జిల్లా సూరంపాలెంలో ఆదిత్య యూనివర్శిటీల ఏర్పాటుకు మంత్రిమండలి అమోదం తెలిపింది.

Wed, 07 Feb 202405:22 AM IST

నంద్యాలలో వ్యవసాయ పాలిటెక్నిక్ కాలేజీ

నంద్యాల జిల్లా డోన్‌లో వ్యవసాయరంగంలో రెండేళ్ల డిప్లొమా కోర్సుతో వ్యవసాయ పాలిటెక్నిక్‌ కాలేజీ ఏర్పాటుకు మంత్రిమండలి ఆమోదం తెలిపింది. ఆచార్య ఎన్‌జీ రంగా అగ్రికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న అగ్రికల్చర్‌ పాలిటెక్నిక్‌ కళాశాల.

Wed, 07 Feb 202405:21 AM IST

క్యాబినెట్ అమోదం

నంద్యాల జిల్లా డోన్‌లో కొత్తగా హార్టికల్చరల్‌ పుడ్‌ ప్రాసెసింగ్‌ పాలిటెక్నిక్‌ కాలేజ్‌ ఏర్పాటుకు ఆమోదం తెలిపిన మంత్రిమండలి. డాక్టర్‌ వైఎస్‌ఆర్‌ హార్టికల్చర్‌ యూనివర్శిటీ పరిధిలో పనిచేయనున్న హార్టికల్చరల్‌ పాలిటెక్నికల్‌ కళాశాల ఏర్పాటుకు క్యాబినెట్ అమోదం తెలిపింది.

Wed, 07 Feb 202405:20 AM IST

అసెంబ్లీ నుంచి టీడీపీ సభ్యుల సస్పెన్షన్

అసెంబ్లీలో ఆందోళన చేస్తున్న టీడీపీ సభ్యులను స్పీకర్ సస్పెండ్ చేశారు.

Wed, 07 Feb 202404:27 AM IST

సంతృప్త స్థాయిలో సంక్షేమ పథకాలు

సంతృప్త స్థాయిలో మానిఫెస్టోను అమలు చేయడం తమ ప్రభుత్వ బెంచ్ మార్క్‌ అని ఆర్ధిక మంత్రి అన్నారు. జగన్ విధానాలు ఎన్నో రాజకీయ పార్టీలకు బెంచ్ మార్క్ అయిందన్నారు. అట్టడుగున ఉండే బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యం ఇచ్చామని.. విద్య, వైద్యం, మహిళ సాధికారిత, వృద్ధులకు ప్రాధాన్యం ఇస్తున్నామని తెలిపారు. ప్రతిపక్షాలు ప్రచారం చేస్తున్నట్టు కాకుండా మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. విభజన హామీలు చాలా వరకు ఎన్నో సాధించు కోగలిగామన్నారు. కచ్చితంగా సంక్షేమానికే పెద్దపీట ఉంటుందని మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి స్పష్టం చేశారు.

Wed, 07 Feb 202404:25 AM IST

అసెంబ్లీలో గందరగోళం

ఏపీ అసెంబ్లీ సమావేశాలు మూడవ రోజు బుధవారం ఉదయం 9 గంటలకు ప్రారంభమయ్యాయి. రైతుల సమస్యలపై చర్చించాలంటూ తెలుగుదేశం వాయిదా తీర్మానాన్ని ఇచ్చింది. దీన్ని స్పీకర్ తమ్మినేని సీతారాం తిరస్కరించడతో వాయిదా తీర్మానంపై చర్చకు టీడీపీ నేతలు పట్టుపట్టారు. వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. రైతు వ్యతిరేక ప్రభుత్వమని, క్రాప్ ఇన్సూరెన్స్‌, కౌలు రైతులను మర్చిపోయిన ప్రభుత్వం నశించాలంటూ నినాదాలు చేశారు. అయితే సభలో అరవండి అంటూ.. మంత్రి కారుమూరి టీడీపీ సభ్యులను రెచ్చగొట్టారు. దీంతో సభలో గందరగోళం నెలకొంది.

Wed, 07 Feb 202404:25 AM IST

95వేల కోట్లతో ఓటాన్ అకౌంట్ బడ్జెట్

ఓట్‌ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ లాంఛనంగా ఆమోద ముద్ర వేసింది. అంతకుముందు మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి తన ఛాంబర్లో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌కు పూజాలు నిర్వహించారు. ఉదయం 11 గంటలకు శాసనసభలో ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్‌ను మంత్రి బుగ్గన ప్రవేశపెట్టనున్నారు. రాబోయే ఆర్థిక సంవత్సరానికి రూ.2.86 లక్షల కోట్ల బడ్జెట్‌ను అంచనా వేయగా, ప్రస్తుతం ఓట్ ఆన్ అకౌంట్‌ కింద 4 నెలలకు రూ.95 వేల కోట్ల నుంచి రూ.96 వేల కోట్ల వరకు బడ్జెట్‌ను ప్రతిపాదించే అవకాశాలు ఉన్నాయి.

Wed, 07 Feb 202404:23 AM IST

ఉదయం 11గంటలకు ఏపీ బడ్జెట్

ఏపీ అసెంబ్లీలో ఉదయం 11 గంటలకు ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్ర నాథ్ బడ్జెట్ ప్రవేశ పెట్టనున్నారు.

Wed, 07 Feb 202404:16 AM IST

ఏపీ అసెంబ్లీలో గందరగోలం

ప్రజాసమస్యలపై టీడీపీ నేతలకు చిత్తశుద్ధి లేదని ఆర్ధిక మంత్రి బుగ్గన ఆరోపించారు. సభను అడ్డుకోవడానికే టీడీపీ సభ్యులు వచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సీనియర్‌ నేతలు ఉన్నప్పటికీ సభలో ఇలా ప్రవర్తించడం కరెక్ట్‌ కాదన్నారు. మరోవైపు అసెంబ్లీలో గందరగోళం నెలకొంది. ఈ రోజు కూడా స్పీకర్‌ తమ్మినేని వెల్‌లోకి దూసుకెళ్లిన టీడీపీ సభ్యులు, సభా కార్యక్రమాలకు అడ్డుపడ్డారు. రెడ్‌లైన్‌ దాటి స్పీకర్‌ వెల్‌లోకి వెళ్లిన టీడీపీ సభ్యులు పేపర్లు చింపి స్పీకర్‌పై వేశారు.

Wed, 07 Feb 202404:14 AM IST

మూడో రోజు ప్రారంభమైన అసెంబ్లీ

ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు మూడో రోజు ప్రారంభమయ్యాయి. ప్రారంభమైన కాసేపటికే సభలో గందరగోళం నెలకొంది. రైతు సమస్యలపై చర్చించాలంటూ టీడీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. స్పీకర్ వెల్లోకి వెళ్లి వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. నిరసనల మధ్యే మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి బిల్లులను ప్రవేశపెట్టారు.

Wed, 07 Feb 202403:50 AM IST

మండలిలో మంత్రి అమర్నాథ్

ఏపీ ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ను శాసన మండలిలో పరిశ్రమలు, ఐటీ శాఖ మంత్రి గుడివాడ అమర్‌నాధ్‌ చదువుతారు.

Wed, 07 Feb 202403:49 AM IST

ఎన్నికల బడ్జెట్

మరో రెండు నెలల్లో ఏపీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ఆర్థిక ఏడాది తొలి 3 నెలల వ్యయానికి (ఏప్రిల్‌ నుంచి జూన్‌ వరకు) ఓటాన్‌ అకౌంట్‌ పద్దు ఆమోదానికి సభలో ప్రతిపాదించనున్నారు. బుధవారమే దీనికి అమోదం తెలుపుతారు.

Wed, 07 Feb 202403:49 AM IST

ఏపీ బడ్జెట్‌కు క్యాబినెట్‌ అమోదం

ఆంధ్రప్రదేశ్‌ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌కు రాష్ట్ర క్యాబినెట్ అమోద ముద్ర వేసింది. సచివాలయంలోని ముఖ్యమంత్రి కార్యాలయంలో జరిగిన క్యాబినెట్ భేటీలో బడ్జెట్‌కు అమోదం తెలిపారు.

Wed, 07 Feb 202403:47 AM IST

ముఖ్యమంత్రికి బడ్జెట్ అందించిన మంత్రి బుగ్గన

సచివాలయంలో ముఖ్యమంత్రి చాంబర్‌లో సీఎం వైఎస్‌ జగన్‌ కు బడ్జెట్‌ ప్రతులను ఆర్ధిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్, ఆర్ధిక శాఖ ఉన్నతాధికారులు అంద చేశారు.

Wed, 07 Feb 202403:46 AM IST

సంక్షేమమే ధ్యేయంగా ఏపీ బడ్జెట్

ఐదేళ్లలో వైద్యం, విద్య, మహిళా సాధికారత, వ్యవసాయం, రైతులు, వృద్ధులకు ప్రాధాన్యత ఇచ్చామని ఆర్ధిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి చెప్పారు. మ్యానిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించిన వారు గతంలో ఎవరు లేరన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన 99శాతం హామీలను అమలు చేశామన్నారు. సంక్షేమాన్ని సంతృప్తి కర స్థాయిలో అమలు చేశామని, బడుగు బలహీన వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ప్రభుత్వం లేకపోతే తమ బ్రతుకులు ఎలా అనుకునే వర్గాలకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana