Sunday, January 19, 2025

‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ ప్రభంజనం.. స్టార్ హీరో సినిమా రేంజ్ లో రెస్పాన్స్..!

ప్రస్తుతం సోషల్ మీడియాలో ‘రాజధాని ఫైల్స్’ సినిమా పేరు మారుమ్రోగిపోతోంది. ఎక్కడ చూసినా ఈ సినిమా గురించే మాట్లాడుకుంటున్నారు. రాజధాని కోసం భూములు త్యాగం చేసిన వేలాది రైతుల ఆవేదనని కళ్ళకి కట్టినట్టు చూపిస్తూ వాస్తవ సంఘటనల ఆధారంగా తెరకెక్కిన ఈ చిత్రానికి భాను దర్శకత్వం వహించారు. శ్రీమతి హిమ బిందు సమర్పణలో తెలుగువన్ ప్రొడక్షన్స్ పతాకంపై కంఠంనేని రవిశంకర్ ఈ సినిమాని నిర్మించారు.

ఎప్పుడైతే ‘రాజధాని ఫైల్స్’ నుంచి ఫస్ట్ లుక్ విడుదలైందో.. ఒక్కసారిగా ఈ సినిమా అందరి దృష్టిని ఆకర్షించింది. ఇక తాజాగా విడుదలైన ట్రైలర్ తో అంచనాలు అమాంతం పెరిగిపోయాయి. స్టార్ హీరోల సినిమాల రేంజ్ లో ‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూసి అందరూ ఆశ్చర్యపోతున్నారు. 24 గంటల్లోనే తెలుగువన్ యూట్యూబ్ ఛానల్ లో 6.5 మిలియన్ వ్యూస్ వచ్చాయి. ఇతర ప్లాట్ ఫామ్స్ లో వచ్చిన వ్యూస్ ని కలుపుకుంటే.. 10 మిలియన్ కి పైగానే ఉన్నాయి. ఇటీవల స్టార్ యాక్టర్స్ నటించగా, ఎంతగానో ప్రమోట్ చేసుకున్న ఇతర పొలిటికల్ సినిమాల ట్రైలర్లకు కూడా ఈ స్థాయి స్పందన లభించలేదు. ఆ సినిమాల ట్రైలర్లకు రోజుల్లో వచ్చిన వ్యూస్ ని.. కేవలం కొద్ది గంటల్లోనే దాటేసి సంచలనం సృష్టించింది ‘రాజధాని ఫైల్స్’.

‘రాజధాని ఫైల్స్’ ట్రైలర్ కు ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. వాస్తవ పరిస్థితులకు అద్దంపట్టేలా ఉన్న సన్నివేశాలకు, సంభాషణలకు ప్రేక్షకులు ఎంతగానో కనెక్ట్ అవుతున్నారు. తామే భుజానికెత్తుకొని మరీ స్వచ్ఛందంగా ఈ సినిమాని ప్రమోట్ చేస్తున్నారు. అందుకే డిజిటల్ ప్లాట్ ఫామ్ లలో సరికొత్త రికార్డులు సృష్టిస్తోంది ‘రాజధాని ఫైల్స్’.

వాస్తవ సంఘటనలకు సహజమైన భావోద్వేగాలను జోడించి ప్రేక్షుకుల్లో ఆలోచన రేకెత్తించేలా ఈ చిత్రాన్ని రూపొందించారు. సంగీత దర్శకుడు మణిశర్మ, ఎడిటర్ కోటగిరి వెంకటేశ్వరరావు, గేయ రచయిత సుద్దాల అశోక్ తేజ వంటి దిగ్గజాలు ఈ సినిమా కోసం పని చేయడం విశేషం. ఈ సినిమా ఫిబ్రవరి 15న థియేటర్లలో విడుదల కానుంది. ట్రైలర్ కి వస్తున్న రెస్పాన్స్ చూస్తుంటే.. ఈ చిత్రం బాక్సాఫీస్ దగ్గర సంచలనాలు సృష్టించడం ఖాయమనిపిస్తోంది.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana