హ్యాపీ బర్తడే.. నరేందర్ అన్న…!

- ముఖ్యమంత్రి సలహాదారు వేం నరేందర్ రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన బుయ్యని శ్రీనివాస్ రెడ్డి
జనవాహిని ప్రతినిధి తాండూరు : తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ప్రజా వ్యవహారాల సలహాదారు వేం నరేందర్ రెడ్డి ని కాంగ్రెస్ పార్టీ నాయకులు, ఆర్బిఓఎల్ సీఈఓ శ్రీ బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మర్యాదపూర్వకంగా కలిశారు. వేం నరేందర్ రెడ్డి జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన నివాసంలో శ్రీనివాస్ రెడ్డి కలిసి పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు తెలియజేశారు.ఈ సందర్భంగా బుయ్యని శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి అత్యంత ఆప్తులుగా, ప్రభుత్వ వ్యవహారాల్లో కీలక పాత్ర పోషిస్తున్న వేం నరేందర్ రెడ్డి మరిన్ని పుట్టినరోజులు జరుపుకోవాలని, నిండు నూరేళ్లూ ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో మరియు రాష్ట్ర అభివృద్ధిలో నరేందర్ రెడ్డి అందిస్తున్న సేవలు అభినందనీయమని ఆయన కొనియాడారు.






