Moon eclipse 2024: సనాతన ధర్మంలో ప్రతి సంవత్సరం ఫాల్గుణ మాసంలోని శుక్ల పక్షం పౌర్ణమి రోజు రాత్రి హోలీకా దహన్ నిర్వహిస్తారు. మరుసటి రోజు హోలీ పండుగ జరుపుకుంటారు. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్ద వయసు వరకు అందరూ రంగులు చల్లుకుంటూ సంతోషంగా గడుపుతారు. సోదర భావం, పరస్పర ప్రేమ, సుహృద్భావానికి చిహ్నంగా ఈ పండుగని భావిస్తారు.