TSPSC Group-1 : తెలంగాణ ప్రభుత్వం గ్రూప్-1 అభ్యర్థులకు గుడ్ న్యూస్ చెప్పింది. గ్రూప్-1లో అదనంగా మరో 60 పోస్టులను భర్తీ చేయనున్నారు. గతంలో టీఎస్పీఎస్సీ 503 పోస్టుల భర్తీకి గ్రూప్-1 నోటిఫికేషన్ జారీ చేసిన విషయం తెలిసిందే. తాజాగా వీటికి మరో 60 పోస్టులను అదనంగా చేరుస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వీటిపై వీలైనంత త్వరగా నోటిఫికేషన్ ఇవ్వాలని టీఎస్పీఎస్సీని ఆదేశించింది. ఈ కొత్త పోస్టులకు సప్లిమెంటరీ నోటిఫికేషన్ ఇస్తారా? పాత నోటిఫికేషన్ రద్దు చేసి మరో నోటిఫికేషన్ జారీ చేస్తారా? అనేది తెలియాల్సి ఉంది. గతేడాది జూన్ 11న 503 గ్రూప్-1 పోస్టుల భర్తీకి టీఎస్పీఎస్సీ ప్రిలిమ్స్ పరీక్ష నిర్వహించింది. అయితే పేపర్ లీకేజీ వ్యవహారంతో హైకోర్టు ఈ పరీక్షను రద్దు చేసింది.