Hyundai Motors India sales : కాగా.. ఈ హ్యుందాయ్ మోటార్ ఐపీఓ భారీగానే ఉంటుందని తెలుస్తోంది. కంపెనీ వాల్యూ 22- 28 బిలియన్ డాలర్లు అని ప్రపంచంలోనే ప్రముఖ ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ సంస్థలు అంచనా వేశాయి. గత వారం సౌత్ కొరియాకు వెళ్లిన గోల్డ్‌మాన్ సాక్స్, సిటీ, మోర్గన్ స్టాన్లీ, జేపీ మోర్గాన్, బ్యాంక్ ఆఫ్ అమెరికా, హెచ్ఎస్బీసీ, డ్యూచ్ బ్యాంక్, యూబీఎస్లు.. లెక్కలు వేసి, ఈ అంచనాలను హ్యుందాయ్ సంస్థకు చెప్పాయి. అంటే.. హ్యుందాయ్ మోటార్ ఇండియా మార్కెట్ క్యాపిటల్ రూ. 1.82లక్షల కోట్లు- రూ. 2.32లక్షల కోట్ల మధ్యలో ఉండొచ్చు!