Tuesday, February 4, 2025

పద్మశ్రీ గ్రహీతలకు తెలంగాణ సర్కార్ గుడ్ న్యూస్- రూ.25 లక్షల నగదు బహుమతి, ప్రతి నెలా రూ.25 వేల పింఛన్-hyderabad news in telugu ts govt announced 25 lakh cash prize 25k monthly pension to padma awardees ,తెలంగాణ న్యూస్

TS Govt Felicitates Padma Awardees: కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన పద్మ పురస్కారాలకు ఎంపికైన తెలుగు వారిని తెలంగాణ ప్రభుత్వం సత్కరించింది. హైదరాబాద్ లోని శిల్పకళావేదికలో జరిగిన ఈ కార్యక్రమంలో పద్మ అవార్డులకు ఎంపికైన వారు, సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు మంత్రులు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు పాల్గొన్నారు. పద్మవిభూషణ్‌ అవార్డులకు ఎంపికైన మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు, సినీ నటుడు చిరంజీవిని సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సత్కరించారు. వీరితో పాటు పద్మశ్రీ అవార్డులకు ఎంపికైన గడ్డం సమ్మయ్య, దాసరి కొండప్ప, ఆనందాచారి, ఉమామహేశ్వరి, కేతావత్‌ సోమ్‌లాల్‌, కూరెళ్ల విఠలాచార్యను సన్మానించారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana