“నేను మీకు ఒక చిన్న కథ చెబుతాను. ఓసారి.. రసూల్ అనే వ్యక్తి, ఫరూక్ ఈ అజామ్ దగ్గరికి వెళ్లాడు. “నా భార్య నా మీద ఎప్పుడు కోపంగానే ఉంటోంది,” అని ఫిర్యాదు చేశాడు. అది విన్న ఫరూక్.. రసూల్‌ని తన ఇంటికి తీసుకెళ్లాడు. అదే సమయంలో.. ఫరూక్ భార్య, ఆయన్ని తిట్టడం మొదలుపెట్టింది. అది గమనించాడు రసూల్. అతనితో ఫరూక్.. ఈ విధంగా అన్నాడు.. ‘ఆమె నా భార్య. నా బిడ్డలకు జన్మనిచ్చింది. అన్ని పనులు చూసుకుంటుంది. నా ఇంటి పరువును కాపాడుతుంది. కానీ.. ఆమె కూడా మనిషే కదా. కోపం అనేది సహజం. కోపంలో తను ఏమైనా అంటే.. నేను ఎదురించను. ఆమె మాటలను వింటాను. నువ్వు కూడా ఈ మైండ్‌సెట్‌ని అలవాటు చేసుకో,'” అని అసదుద్దీన్ తన కథను ముగించారు.