‘అతడు’, ‘ఖలేజా’ తరవాత సూపర్ స్టార్ మహేష్ బాబు (Mahesh Babu), మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ (Trivikram) కాంబినేషన్ లో రూపొందిన యాక్షన్ ఎంటర్టైనర్ ‘గుంటూరు కారం’ (Guntur Kaaram). హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మించిన ఈ సినిమాలో శ్రీలీల, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటించారు. సంక్రాంతి కానుకగా జనవరి 12 న థియేటర్లలో విడుదలైన ఈ సినిమా ఒక వర్గం ప్రేక్షకులను ఆకట్టుకొని మంచి వసూళ్లనే రాబట్టింది. అయితే ఇప్పుడు ఈ చిత్రం కేవలం నాలుగు వారాలకే ఓటీటీలో అలరించడానికి సిద్ధమైంది.
‘గుంటూరు కారం’ డిజిటల్ స్ట్రీమింగ్ రైట్స్ ని నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకుంది. తాజాగా ఓటీటీ స్ట్రీమింగ్ డేట్ ని అనౌన్స్ చేసింది. “రౌడీ రమణని సినిమాస్కోప్ 70mm లో చూసారు. ఇప్పుడు నెట్ ఫ్లిక్స్ లో చూడండి.” అంటూ ఫిబ్రవరి 9 నుంచి ఈ సినిమాని స్ట్రీమింగ్ చేయనున్నట్లు నెట్ ఫ్లిక్స్ ప్రకటించింది. తెలుగుతో పాటు తమిళ, మలయాళం, కన్నడ, హిందీ భాషల్లో అందుబాటులోకి రానుందని పేర్కొంది. మరి ఓటీటీలో ‘గుంటూరు కారం’కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.