
- ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి సహకారంతో 26వ వార్డు అభివృద్ధికి కృషి చేస్తా రాజు గౌడ్
జనవాహిని ప్రతినిధి తాండూరు : మున్సిపల్ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో తాండూరులో రాజకీయ సందడి నెలకొంది. ఈ నేపథ్యంలో 26వ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇంచార్జ్ రాజు గౌడ్ వార్డు అభివృద్ధి ధ్యేయంగా తన ప్రచారాన్ని ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో వార్డు అభ్యర్థిగా బరిలో ఉన్న ఆయన, వార్డు ప్రజల సమస్యలను తెలుసుకుంటూ వారి ఆశీర్వాదం కోరుతున్నారు.ఈ సందర్భంగా రాజు గౌడ్ మాట్లాడుతూ.. తాండూరు నియోజకవర్గ అభివృద్ధే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఎమ్మెల్యే మనోహర్ రెడ్డి అడుగుజాడల్లో తాను నడుస్తానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యే అవకాశం ఇస్తే, ఆయన సహకారంతో 26వ వార్డును ఆదర్శవంతంగా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చారు. వార్డులో నెలకొన్న డ్రైనేజీ, మంచినీటి సరఫరా, రోడ్ల వంటి మౌలిక వసతుల కల్పనకు ప్రాధాన్యత ఇస్తానని ఆయన పేర్కొన్నారు.వార్డు ప్రజల కష్టసుఖాల్లో తోడుగా ఉంటూ, నిరంతరం అందుబాటులో ఉంటానని రాజు గౌడ్ విజ్ఞప్తి చేశారు. తాండూరు అభివృద్ధిలో 26వ వార్డు కూడా కీలక భాగస్వామ్యం అయ్యేలా శ్రమిస్తానని, ప్రజలు తనను ఆశీర్వదించాలని ఆయన కోరారు.



