
- ఓటర్ల జాబితాలో అక్రమాలు
- 25వ వార్డులో 500 అదనపు ఓట్లు
జనవాహిని ప్రతినిధి తాండూరు: తాండూరు మున్సిపల్ పరిధిలోని ముసాయిదా ఓటర్ల జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. పట్టణంలోని 25వ వార్డు జాబితాలో భారీగా అవకతవకలు జరిగాయని బీఆర్ఎస్ యువ నాయకుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. వార్డుకు సంబంధం లేని సుమారు 500 మంది ఓటర్లను ఈ జాబితాలో చేర్చారని ఆయన ఆరోపించారు. తాండూరు పట్టణంలోని 25వ వార్డు ఓటర్ల జాబితాపై బీఆర్ఎస్ యువ నాయకుడు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సదరు వార్డులో స్థానికంగా నివసించే వారి కంటే బయటి వారే ఎక్కువగా ఉన్నారని ఆయన ఆరోపించారు.ఇతర వార్డులకు చెందిన వారిని వెంటనే తొలగించి, జాబితాను సవరించిన తర్వాతే తుది జాబితాను ప్రకటించాలని డిమాండ్ చేశారు.



