Wednesday, December 25, 2024

TeluguOne News | Regional News | AP News | AP Political News | Regional News | Telugu Cinema News | Telugu Cinema Gossip – Political News – Headlines – Political Gossip – International – Top Stories

2024 జూన్ 12న నారా చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేశారు. సెప్టెంబర్ 20వ తేదీ నాటికి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 100 రోజులు అవుతుంది. రాష్ట్ర ఖజానాను జగన్ రెడ్డి దివాళా తీయించినా 100 రోజుల్లోనే 100కు పైగా అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను చేశారు. మొదటి వందరోజుల్లో జగన్ ప్రభుత్వం రూ.250 పెన్షన్ పెంచడం తప్ప మరే ఇతర హామీని అమలు చేయలేదు. మళ్లీ జగనే వచ్చి ఉంటే కరెంట్ ఛార్జీల బాదుడు, కరెంటు కోతలు పెరిగి ఉండేవి. ప్రజల ధన, మాన, ప్రాణాలకు, ఆస్తులకు రక్షణ ఉండేది కాదు. పింఛన్ రూ. 3 వేలకే పరిమితమై ఉండేది. నేడు చంద్రన్న చల్లని పాలనలో ప్రజలు స్వేచ్ఛగా జీవించగలుగుతున్నారు.

100 రోజుల్లో సాధించిన ప్రధాన విజయాలు:

1. ఇచ్చిన హామీ మేరకు పెన్షన్లు ఒకేసారి రూ.1,000 పెంచి 1వ తేదీనే ఇళ్ల వద్ద రూ.4 వేలు ఇవ్వడం జరిగింది. బకాయిలు రూ.3 వేలు కూడా కలిపి రూ.7 వేలు పెన్షన్‌ను 64 లక్షల మందికి పైగా ఇవ్వడం దేశ చరిత్రలో తొలిసారి.

2. నిరుద్యోగ యువతకు 16,437 ఉపాధ్యాయ నియామకాలకు మెగా డీఎస్సీకి చర్యలు తీసుకున్నారు. తొమ్మిది డీఎస్సీల ద్వారా 1996 నుండి నేటి వరకు చంద్రబాబు ప్రభుత్వాలు 2,32,179 మంది ఉపాధ్యాయ నియామకాలు చేశాయి, జగన్ ఐదేళ్ల పాలనలో ఒక్క డీఎస్సీ కూడా నిర్వహించకుండా యువతకు ద్రోహం చేశారు.

3. పేదవారి ఆకలి తీర్చేందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు రాష్ట్ర వ్యాప్తంగా ఇప్పటికే 100 పైగా అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేసి పేదల పెన్నిధి అయ్యారు.

4. విజయవాడ వరద బాధితులకు ప్రస్తుత ప్రభుత్వం ప్రతి ఇంటికి 25 కేజీల బియ్యం, 2 కేజీల బంగాళదుంపలు 2 కేజీల కందిపప్పు, 1 కేజీ చక్కెర, 1 లీటర్ పామాయిల్, బిస్కెట్లు అందించింది. ఆదివాసి ప్రాంతాలలో జగన్ ప్రభుత్వం గోదావరి వరద బాధితులకు 5 కేజీల బియ్యం, 50 గ్రాముల కందిపప్పు, 4 టమోటాలు, 4 బంగాళాదుంపలు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుంది.

5. హామీ మేరకు ల్యాండ్ టైటిలింగ్ యాక్టు రద్దు చేసి ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించారు.

6. డ్వాక్రా మహిళలకు వడ్డీ లేని రుణాలను రూ.5 లక్షల నుండి రూ. 10 లక్షలకు పెంచారు.

7. ప్రధాని నరేంద్ర మోడీ ప్రభుత్వం అమరావతికి రూ.15వేల కోట్లు మంజూరు.

8. పోలవరం నిర్మాణానికి రూ.12,500 కోట్లకు కేంద్రం అనుమతి పొందారు.

9. కర్నూలు జిల్లా ఓర్వకల్లు, కడప జిల్లా కొప్పర్తి పారిశ్రామిక పార్కులకు రూ.25 వేల కోట్ల పెట్టుబడులు, 75 వేల మంది యువతకు ఉపాధికి కేంద్రం ఆమోదించింది.

10. వాట్సాప్ సందేశానికి స్పందించిన మంత్రి నారా లోకేష్, 25 మంది దివ్యాంగ విద్యార్థుల మార్కుల మెమోల్లో మార్పులు చేసి ప్రతిష్టాత్మకమైన IIT, NIT, IIITలలో ప్రవేశాలకు చొరవ.

11. డిప్యూటీ సీయం పవన్ కళ్యాణ్ ఆధ్వర్యంలో ఆగస్టు 23న స్వర్ణ గ్రామ పంచాయతీ పేరిట రాష్ట్ర వ్యాప్తంగా 13,326 పంచాయతీల్లో ఒకే రోజు గ్రామసభలు నిర్వహించారు. రూ.4,500 కోట్ల విలువైన ఉపాధి హామీ పనులకు తీర్మానాలు చేశారు. ఒకేరోజు సభలు నిర్వహించడం అతిపెద్ద గ్రామ పాలనగా గుర్తిస్తూ వరల్డ్ రికార్డ్ యూనియన్ తమ రికార్డుల్లో నమోదు చేసింది.

12. ప్రజావేదిక, ప్రజాదర్బార్ ద్వారా ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ 50 వేలకు పైగా అర్జీల స్వీకరణ.

.13. ఉత్తరాంధ్ర, రాయలసీమలోని 7 వెనుకబడిన జిల్లాలకు కేంద్రం నుండి ప్రత్యేక నిధులు కేటాయించారు, అదనంగా ప్రకాశం జిల్లాను చేర్చారు.

14. విశాఖ రైల్వే జోన్‌కు మడపర్లోవలో 52 ఎకరాలు పూర్తి హక్కులతో కేటాయింపు.

15. పంచాయతీలకు రూ.1,452 కోట్లు విడుదల చేసింది. జగన్ ప్రభుత్వం పంచాయతీలు, మున్సిపల్ నిధులు రూ.12 వేల కోట్లు దారి మళ్లించింది.

16. టీడీపీ ప్రభుత్వం రైతులకు ధాన్యం బకాయిలు రూ. 1,674 కోట్లు విడుదల చేసింది.

17. ఆరోగ్యశ్రీకి జగన్ 1600 కోట్లు బకాయిలు పెట్టారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటి వరకు రూ. 700 కోట్లు బకాయిలు చెల్లించింది.

18. నీరు-చెట్టు బకాయిలు రూ.256 కోట్లు చెల్లింపు జరిగింది.

19. రాజధాని కౌలు రైతుల బకాయిలు రూ. 400 కోట్లు చెల్లించారు.

20. పేదల గృహనిర్మాణ బకాయిలు రూ.50 కోట్లు చెల్లింపు.

21. వరదల్లో పంట నష్టం ఎకరాకు రూ.2 వేల నుండి రూ.10 వేలకు పెంపు.

22. జగన్ రేషన్ బియ్యం మాత్రమే ఇచ్చారు. ఎన్డీఏ ప్రభుత్వం బియ్యంతోపాటు పంచదార, గోధుమపిండి కూడా ఇవ్వడమైంది. మార్కెట్ లో కంది పప్పు రూ. 180 ఉంటే దాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా రూ.150కి తగ్గించారు. కొత్తగా మరో 4 వేల రేషన్ షాపులను ప్రారంభించబోతున్నారు.

23. అక్రమ కేసుతో ఓ మహిళను వేధించిన ముగ్గురు ఐపీఎస్‌లను సస్పండ్ చేసి రాష్ట్రంలో రికార్డ్ సృష్టించారు.

24. ఉచిత ఇసుక విధానాన్ని ప్రవేశపెట్టారు. సెప్టెంబర్ 19 నుంచి ఆన్ లైన్ బుకింగ్, అందుబాటులోకి పోర్టల్, యాప్.

25. విషపూరిత మధ్యం స్థానంలో నాణ్యమైన అన్ని బ్రాండ్లు అందుబాటులో ఉంచడమైంది. మద్యం ధరలు తగ్గుదలకు కృషి చేయడం జరుగుతోంది.

26. చేనేత వృత్తిదారులకు జీఎస్టీ ఎత్తివేత, గృహ నిర్మాణానికి అదనంగా రూ.50 వేలు మంజూరు చేయడం జరిగింది.

27. మత్స్యకారుల ఉపాధిని దెబ్బతీసే 217 జీవోను రద్దు చేయడమైంది.

28. నాయి బ్రాహ్మణుల వేతనాలు రూ.15 వేల నుండి రూ.25 వేలకు పెంచారు.

29. 90 మంది ఎస్టీ యువతను కొత్తగా ఉపాధ్యాయులుగా నియమించడమైంది. కోయభారతి టీచర్ పోస్టులు 700 భర్తీ.

30. ఉపాధి పథకం ద్వారా 6.50 కోట్ల పనిదినాలు పెంచడం వల్ల 54 లక్షల మందికి అదనంగా లబ్ది చేకూరుతోంది.

31. సీఎం చంద్రబాబు గారు పది రోజులు విజయవాడలో బస్‌లోనే ఉండి వరద బాధితులకు సత్వర సహాయ చర్యలు చేపట్టారు. రెట్టింపు సహాయాన్ని అందించారు.

32. యుద్ధప్రాతిపదికన విజయవాడ వరద బాధితులకు టిఫిన్, భోజనాలు 10 రోజుల్లో 1.14 కోట్ల మందికి వాటర్ బాటిల్స్ 1.12 కోట్లు, పాల పాకెట్లు 35 లక్షలు, బిస్కెట్ పాకెట్స్ 46 లక్షలు, కోడిగుడ్లు 4 లక్షలు, కూరగాయలు 3,385 క్వింటాళ్లు అందించడమైంది.

33. అచ్యుతాపురం ఫార్మా ప్రమాద మృతులు 17 మందికి ఒక్కొక్కరికి కోటి చొప్పున 17 కోట్లు, తీవ్రంగా గాయపడ్డ 36 మందికి ఒక్కొక్కరికి రూ.50 లక్షలు, గాయపడ్డ 10 మందికి ఒక్కొక్కరికి 25 లక్షల ఆర్థిక సాయం అందించడం జరిగింది.

34. తుంగభద్రలో కొట్టుకుపోయిన గేటును వరద సమయంలోనే బిగించి రాయలసీమకు సాగు, తాగునీటికి రక్షణ కల్పించడమైంది.

35. బుడమేరు గండ్లను యుద్దప్రాతిపదికన పూడ్చడమైంది.

36. ప్రకాశం బ్యారేజీని ఢీకొట్టించిన 3 ఐరన్ బోట్లను తొలగించడమైంది.

37. బీపీసీఎల్ కంపెనీ ఏపీలో 70 వేల కోట్ల పెట్టుబడులు పెట్టనుంది.

38. ఇంటర్ విద్యార్థులకు ఉచిత పాఠ్య పుస్తకాలపై జీవో విడుదల.

39. ప్రభుత్వ ఉద్యోగులకు 1వ తేదీనే జీతాలు.

40. ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిదాతల పేర్లు.

41. అర్చకుల వేతనాలు రూ.10 వేల నుండి 15 వేలకు పెంపు.

42. గృహ నిర్మాణానికి సహకారం రూ.4 లక్షలకు పెంపు, గ్రామాల్లో 3 సెంట్లు, పట్టణాల్లో 2 సెంట్లు పట్టా.

43. MSMEలకు ప్రభుత్వ గ్యారంటీతో రూ.1000 కోట్ల రుణాలు.

44. 77 వేల మంది CBSE విద్యార్థులకు స్టేట్ బోర్డులో పరీక్షలు రాసే వెసులుబాటు. ఆయాలు, వాచ్‌మెన్‌ల జీతాలు, ఇతర బకాయిలు రూ.89 కోట్లు విడుదల.

45. సౌదీ ఎడారిలో దుర్భర స్థితిలో ఉన్న మామిడి దుర్గ, జుబేద, జుబేర్, వీరేంద్రను స్వదేశానికి తెప్పించిన మంత్రి లోకేష్.

46. అంతర్జాతీయ పవర్ లిఫ్టింగ్ క్రీడాకారిణి సాదియా అల్మాస్‌కు రూ.3 లక్షల ఆర్థిక సాయం.

47. రాష్ట్రంలో భారీ విస్తరణ ద్వారా 15 వేల ఉద్యోగాల కల్పనకు HCLను ఒప్పించిన నారా లోకేష్.

48. ఫ్యాక్స్ కాన్‌ను ఒప్పించి ఏపీలో ఎలక్ట్రానిక్ వాహనాలు, సెమీ కండక్టర్ల తయారీ.

49. IT, ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్, ఫుడ్ ప్రాసెసింగ్, రెన్యువబుల్ ఎనర్జీలలో పెట్టుబడులు పెట్టేందుకు టాటా గ్రూప్ సంసిద్ధత.

50. గత ప్రభుత్వం బకాయి పెట్టిన గుడ్లు, చిక్కీల కాంట్రాక్టర్లకు 178.5 కోట్లు విడుదల.

51. అంతర్జాతీయ షటిల్ బ్యాడ్మింటన్ క్రీడాకారుడు కేళావత్ చరణ్ నాయక్‌కు 3 లక్షల ఆర్థిక సాయం అందజేత.

52. మదనపల్లె డిగ్రీ కళాశాల బోధన, బోధనేతర సిబ్బందికి 23 నెలలుగా బకాయిపడ్డ జీతాలు విడుదల.

53. రూ.5 వేల కోట్ల సాయంతో సూర్యలంక, శ్రీశైలం, రాజమహేంద్రవరం, సంగమేశ్వరంలలో పర్యాటకం అభివృద్ధికి కేంద్రం ముందడుగు.

54. www.goir.ap.gov.in వెబ్ సైట్ పునరుద్ధరణ.

55. తిరుపతితో సహా అన్ని దేవాలయాల ట్రస్ట్ బోర్డులలో మెంబరుగా ఒక బ్రాహ్మణ సభ్యుడికి చోటు.

56. ధూప దీప నైవేద్యాలకు రూ.50 వేల లోపు వార్షిక ఆదాయం ఉన్న గుడులకు సాయం రూ. 5 వేల నుండి 10 వేలకు పెంపు. రూ.50 వేలకు పైనున్న గుడులకు రూ. 10 వేల నుండి 15 వేలకు పెంపు.

57. వరదల్లో చనిపోయిన వారి కుటుంబాల ఒక్కొక్కరికి రూ.5 లక్షలు.

58. 269 సూపర్ న్యూమరీ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్.

59. 2,800 కోట్ల పెట్టుబడులతో గోద్రేజ్ కంపెనీ రాష్ట్రానికి రాక.

60. జిల్లా కేంద్రాలు, కార్పొరేషన్లలో 100 మహిళా వసతి గృహాల ఏర్పాటుకు క్యాబినెట్ ఆమోదం

61. తెలంగాణ నుంచి రూ.2,50 కోట్లు బకాయిలు రాబట్టడమైంది..

62. మహిళల ఉచిత ప్రయాణ నిమిత్తం 1489 కొత్త బస్సుల కొనుగోలు.

63. ఉపాధి హామీ పథకం మెటీరియల్ క్రింద రూ.2 వేల కోట్లతో సిమెంట్ రోడ్ల నిర్మాణం.

64. భోగాపురం ఎయిర్ పోర్టు పనుల్లో భాగంగా సీఎం, కేంద్ర మంత్రి సందర్శన.

65. యూట్యూబ్, గూగుల్, మహీంద్ర వంటి ప్రముఖ కంపెనీలతో భేటీలు.

66. టీటీడీ లడ్డూల నాణ్యత పెంపు.

67. ముచ్చుమర్రి గ్యాంగ్ రేప్ నేరస్థులపై కఠిన చర్యలు.

68. కౌలు రైతులకు కోఆపరేటివ్ బ్యాంకు రుణాలు.

69. మైనార్టీ విద్యార్థులకు టెట్‌లో ఉచిత శిక్షణ కోసం 19 కేంద్రాల ఏర్పాటు.

70. 90 శాతం సబ్సిడీతో డ్రిప్ ఇరిగేషన్ పునరుద్ధరణ.

71. మదనపల్లె భూ కబ్జాలపై పబ్లిక్ హియరింగ్ సదస్సులు.

72. భోగాపురం, విశాఖ భూకబ్జాలపై పబ్లిక్ హియరింగ్.

73. తెలుగుదేశం కేంద్ర కార్యాలయంలో మంత్రులు, పార్టీ నాయకులు, రాష్ట్ర పార్టీ అధ్యక్షులు పల్లా శ్రీనివాస్ యాదవ్‌చే అర్జీల స్వీకరణ.

74. సీఎం పర్యటనలకు పరదాలు లేవు, ట్రాఫిక్ అంతరాయాలు లేవు, చెట్ల నరికివేతలు లేవు.

75. గత ప్రభుత్వ దోపిడీలపై 7 శ్వేతపత్రాలు విడుదల. మైనింగ్, ఎక్సైజ్ ఉన్నతాధికారుల సస్పెన్షన్లు.

76. విభజన సమస్యలపై ఏపీ, టీఎస్ ముఖ్యమంత్రుల భేటీ.

77. రాజధాని రైతులకు కౌలు 5 ఏళ్ల పొడిగింపు.

78. ఇల్లు లేదని గోడు చెప్పుకున్న రాములు నాయక్‌కు ఇల్లు కేటాయింపు.

79. ఆంధ్రప్రదేశ్ రాజముద్రతో పట్టాదారు పాస్ పుస్తకాలు.

80. స్కాన్ చేస్తే భూమి సరిహద్దులు, లొకేషన్ వచ్చేలా క్యూ ఆర్ కోడ్‌తో పాస్ పుస్తకాలు.

81. భూముల రీ సర్వే నిలిపివేత.

82. గంజాయి, డ్రగ్స్ నియంత్రణకు ఐదుగురు మంత్రులతో కమిటీ ఏర్పాటు,

83. శ్రీశైలంలో జలహారతి ఇచ్చిన ముఖ్యమంత్రి 20 ఏళ్ల తరువాత జూలైలో నిండిన శ్రీశైలం రిజర్వాయర్.

84. జలకళతో రాష్ట్రంలోని అన్ని రిజర్వాయర్లు.

85. ఆరుద్రకు ఆర్థిక సహాయం అందజేత.

86. అమరావతి రింగ్ రోడ్డు, రైల్వే లైన్‌కు కేంద్రం ఆమోదం.

87. విశాఖ స్టీలు కర్మాగారాన్ని సందర్శించిన కేంద్రమంత్రి కుమారస్వామి ప్రైవేటీకరణ చేయబోమని హామీ.

88. ఇళ్ల నిర్మాణాలకు రూ.4 లక్షలకు పెంపు. పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లకు పెంపు.

89. రూ.250 కోట్లతో XLRI మేనేజ్మెంట్ స్కూల్.

90. పొల్యూషన్ కంట్రోల్ బోర్డు చైర్మన్ బీసీ ఉన్నతాధికారి పి. కృష్ణయ్య నియామకం.

91. యువగళం పాదయాత్రలో లోకేష్ ఇచ్చిన హామీ మేరకు బంగారుపాళెంలో డయాలసిస్ యూనిట్ ఏర్పాటు.

92. ఎన్టీఆర్ విదేశీ విద్య బకాయిలు రూ.32 కోట్లు విడుదల.

93. పోలవరం ఎడమగట్టు ప్రధాన కాల్వ విశాఖ వరకు ఉత్తరాంధ్ర సాగు, తాగు జలాలకు రూ.959 కోట్లు కేటాయింపులు, పాలనామోదం.

94. నెల్లూరు జిల్లా దామవరం విమానాశ్రయ ల్యాండ్ అక్విజిషన్‌కి రూ.96 కోట్లు ఆమోదం.

95. విద్యుత్ కోతలు లేవు. విద్యుత్ ఛార్జీల బాదుడు లేదు.

96. నూజివీడు IIITలో కలుషిత ఆహార ఘటనకు కారణమైన ఫుడ్ కాంట్రాక్టర్ల తొలగింపు.

97. రాష్ట్ర వ్యాప్తంగా రహదారుల మరమ్మతులకు రూ.290 కోట్లు, వరదలతో దెబ్బతిన్న రోడ్ల పునరుద్ధరణకు రూ.186 కోట్లను రాష్ట్ర విపత్తు నివారణ నిధి నుంచి విడుదల.

98. సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్ధి మిత్ర, డొక్కా సీతమ్మ మధ్యాహ్న బడి భోజనం, అబ్దుల్ కలాం ప్రతిభా పురస్కారం… ఇలా ప్రభుత్వ పథకాలకు స్ఫూర్తిప్రదాతల పేర్లు. 

99. విజయవాడలో హెల్త్ యూనివర్సిటీ పేరును డా. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీగా పునరుద్ధరణ.

100. అయిదేళ్లలో రూ.10 లక్షల కోట్ల పెట్టుబడుల ఆకర్షణ, 7.5 లక్షల మందికి ఉపాధి లక్ష్యాలుగా సీయం చంద్రబాబు గుజరాత్‌లోని గాంధీనగర్లో జరిగిన ప్రపంచ పునరుత్సాదక పెట్టుబడుల సమావేశంలో పాల్గొన్నారు. ఎవ్‌రెన్ సంస్థ సీఈఓ సుమన్ కుమార్ ఆంధ్రప్రదేశ్‌లో భారీగా పెట్టుబడులు పెట్టడానికి తన ఆసక్తిని వ్యక్తం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana