సోనియా విషయంలో గొడవ
“స్టిక్స్ విరిగిపోతే గేమ్ ఆపాలని సంచాలక్ చెప్పారు. కానీ, మీరు ఆగలేదు. మీ సంచాలక్ బెలూన్స్‌ను బాక్స్‌లోకి పంపకుండా ఎందుకు సైలెంట్‌గా ఉంది” అని నిఖిల్‌తో గొడవ పెట్టుకుంది యష్మీ. అరవకు అని నిఖిల్ అన్నాడు. నేను అరుస్తానని యష్మీ అంటే.. అయితే, పక్కకు వెళ్లి అరువు, నువ్వు ఎవరు నాకు చెప్పడానికి అని నిఖిల్ ఫైర్ అయ్యాడు. అలా ఇద్దరూ సోనియా విషయంలో గొడవపడ్డారు.