హైదరాబాద్‌లో జానీ మాస్టర్‌పై అత్యాచారం కేసు నమోదు అయ్యింది. జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధిస్తున్నాడని రాయదుర్గం పీఎస్‌లో ఓ యువతి కంప్లైంట్ ఇచ్చింది. తనపై అత్యాచారం చేశాడని, బెదిరించి గాయపరిచాడని ఆరోపించింది. రాయదుర్గం పోలీస్ స్టేషన్ లో జానీ మాస్టర్‌పై జీరో ఎఫ్‌ఐఆర్ నమోదు చేసిన పోలీసులు… కేసును నార్సింగి పీఎస్ కు బదిలీ చేశారు. అవుట్ డోర్ షూటింగ్ సమయాల్లో జానీ మాస్టర్ తనను లైంగికంగా వేధించాడని యువతి ఫిర్యాదు చేసింది. నార్సింగిలోనూ తనపై లైంగిక దాడి జరిగిందని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. 2017లో ఒక టీవీ షోలో జానీ మాస్టర్ తనకు పరిచయమైనట్లు బాధితురాలు తెలిపింది. ఆ తర్వాత జానీ మాస్టర్ టీమ్ లో అసిస్టెంట్ కొరియోగ్రాఫర్ చేరానన్నారు. ఒక షో కోసం జానీకో కలిసి తాను ముంబయికి వెళ్లానని, అక్కడి హోటల్లో జానీ మాస్టర్ తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని బాధితురాలు ఫిర్యాదులో తెలిపింది.