టీజీ ఐసెట్ ర్యాంక్ కార్డు ఇలా డౌన్లోడ్ చేసుకోండి:
- తెలంగాణ ఐసెట్ పరీక్ష రాసిన అభ్యర్థులు https://icet.tsche.ac.in/ వెబ్ సైట్ లోకి వెళ్లాలి.
- హోం పేజీలో కనిపించే ICET Results 2024 ఆప్షన్ పై క్లిక్ చేయాలి.
- మీ హాల్ టికెట్ నెంబర్ తో పాటు Registration Number, పుట్టినతేదీ వివరాలను ఎంట్రీ చేయాలి.
- సబ్మిట్ బటన్ పై నొక్కితే మీ ర్యాంక్ కార్డు డిస్ ప్లే అవుతుంది.
- ప్రింట్ లేదా డౌన్లోడ్ అనే ఆప్షన్ పై క్లిక్ చేస్తే కాపీ పొందవచ్చు.
- అడ్మిషన్ ప్రక్రియలో ర్యాంక్ కార్డు కీలకం.
పుల్ డిమాండ్…!
ఇటీవలే ఫస్ట్ ఫేజ్ కౌన్సెలింగ్ ముగిసింది. ఎంసీఏ కోర్సుల్లో 86 శాతం, ఎంబీఏలో 87.5 శాతం సీట్లు భర్తీ అయ్యాయి. ఈ ఏడాది మొత్తం 34,748 సీట్లు ఉండగా… 30,300 సీట్లు ఫస్ట్ ఫేజ్ లోనే భర్తీ అయ్యాయి. ఇంకా 4,448 సీట్లు మాత్రమే మిగిలి ఉన్నాయి. తొలి విడతలో సీట్లు పొందిన అభ్యర్థులు రిపోర్టింగ్ చేసే గడువు కూడా సెప్టెంబర్ 17వ తేదీతో పూర్తి అయింది. ఈ ఏడాది ఐసెట్ ప్రవేశాలకు బాగా డిమాండ్ పెరిగిందని పలువురు నిపుణులు చెబుతున్నారు.