Tuesday, December 24, 2024

రాహుల్ గాంధీపై బీజేపీ నేత వివాదాస్పద వ్యాఖ్యలు-భగ్గుమన్న కాంగ్రెస్ శ్రేణులు-karimnagar congress leaders protest demands arrest tanwider singh comments on rahul gandhi ,తెలంగాణ న్యూస్

కరీంనగర్ లో స్వల్ప ఉద్రిక్తత

రాహుల్ గాంధీపై బీజేపీ నేత తన్వీదర్ సింగ్ చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ ఆందోళన కరీంనగర్ లో స్వల్ప ఉద్రిక్తతకు దారి తీసింది.‌ తెలంగాణ చౌక్ లో సింగ్ దిష్టిబొమ్మ దగ్ధానికి యత్నించారు. పోలీసులు వారిని అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్యకర్తలకు పోలీసులకు మధ్య తోపులాట చోటు చేసుకుంది. ఉద్రిక్తతకు దారి తీసింది. పోలీసులు దిష్టిబొమ్మ దగ్దం చేయకుండా అడ్డుకుని దిష్టిబొమ్మను లాక్కెళ్లారు. మరో వైపు నుంచి వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు దిష్టి బొమ్మ దగ్దం చేశారు. ఇందిరా చౌక్ లో రోడ్డుపై బైఠాయించి ధర్నా రాస్తారోకో చేశారు.‌ ఆందోళనలో సుడా చైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి, డీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ పద్మాకర్ రెడ్డి, అర్బన్ బ్యాంక్ పర్సన్ ఇన్ ఛార్జి విలాస్ రెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ ఛైర్మన్ ఆకారపు భాస్కర్ రెడ్డి పాల్గొని బీజేపీ వైఖరిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana