ఐఆర్‌సిటిసితో జొమాటోతో చేతులు కలిపిన విషయాన్ని జొమాటో సీఈవో దీపిందర్ గోయల్ తన సోషల్ మీడియా ద్వారా ప్రకటించారు. నిజానికి జొమోటో ఐఆర్సిటిసి కలిసి గత ఏడాదే పైలెట్ ప్రాజెక్టుగా దీన్ని మొదలుపెట్టాయి. న్యూఢిల్లీ, కాపూర్, లక్నో, వారణాసి, ప్రయాగ్ రాజ్… ఈ రైల్వేస్టేషన్లో జొమాటో సేవలను ప్రారంభించారు. అక్కడి నుంచి విశేషమైన స్పందన రావడంతో ఈ సేవలు దేశం మొత్తానికి విస్తరించాలని ఐఆర్ సిటిసీ… జొమాటోను కోరింది. ఢిల్లీ, అహ్మదాబాద్, సూరత్, నాగపూర్ వంటి పెద్ద రైల్వే స్టేషన్లతో పాటు చిన్న రైల్వే స్టేషన్లో కలిపి ప్రస్తుతం 100 కంటే ఎక్కువ స్టేషన్లలోనే జొమాటో తన సేవలను అందించడానికి అందుబాటులో ఉంది.