ఈరోజు నిపుణులు 5 స్టాక్స్ ఎంచుకున్నారు. వీటితో రాబడి వచ్చే అవకాశం ఉంటుందని చెబుతున్నారు. ఛాయిస్ బ్రోకింగ్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సుమీత్ బగాడియా మంగళవారం రెండు స్టాక్ ఎంపికలను సిఫారసు చేయగా, మిగిలిన మూడు స్టాక్స్ ను ఆనంద్ రాఠీ టెక్నికల్ రీసెర్చ్ సీనియర్ మేనేజర్ గణేష్ డోంగ్రే కొనుగోలు చేయాలని సిఫారసు చేశారు. వీటిలో ఫోర్టిస్ హెల్త్‌కేర్ లిమిటెడ్, బ్లూ స్టార్ లిమిటెడ్, ఇంటెలిజెన్స్ డిజైన్ ఎరీనా లిమిటెడ్, రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్, కోరమాండల్ ఇంటర్నేషనల్ లిమిటెడ్ ఉన్నాయి.