ఏపీ, తెలంగాణలో పరీక్ష ఎప్పుడంటే?
జేఎన్వీ పరీక్ష-2024 ను రెండు దశల్లో నిర్వహిస్తారు. వచ్చే ఏడాది జనవరి 18, ఏప్రిల్ 12న పరీక్షలు నిర్వహించనున్నారు. ఆంధ్రప్రదేశ్, అసోం, అరుణాచల్ ప్రదేశ్ (దిబాంగ్ వ్యాలీ, తవాంగ్ జిల్లాలు మినహా), బీహార్, ఛత్తీస్‌గఢ్, గోవా, గుజరాత్, హర్యానా, హిమాచల్ ప్రదేశ్ (చంబా, కిన్నౌర్, మండి, సిర్మౌర్, కులు మినహా), లాహౌల్, స్పితీ, సిమ్లా జిల్లాలు, జమ్మూ కాశ్మీర్ (జమ్మూ-I, జమ్మూ-II, సాంబాకు మాత్రమే), జార్ఖండ్, కేరళ, కర్ణాటక, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, మణిపూర్, ఒడిశా, పంజాబ్, రాజస్థాన్, త్రిపుర, తెలంగాణ, ఉత్తర ప్రదేశ్ , ఉత్తరాఖండ్, పశ్చిమ బెంగాల్ (డార్జిలింగ్ మినహా), అండమాన్ నికోబార్ దీవులు, చండీగఢ్, దాదర్ నగర్ హవేలీ, డామన్ డయ్యూ, ఢిల్లీ, లక్షద్వీప్, పుదుచ్చేరి అభ్యర్థులకు జనవరి 18న పరీక్ష జరుగుతుంది.