Friday, January 10, 2025

ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన లిక్విడ్ తేలు విషం, దీంతో ఔషధాల తయారీ-scorpion venom is the most expensive liquid in the world making medicine from it ,లైఫ్‌స్టైల్ న్యూస్

క్యాన్సర్ చికిత్సలో తేలు విషం

చైనా, గ్రీసు దేశాల్లో వేల ఏళ్ల క్రితం నుంచి తేలు విషాన్ని వివిధ రకాల వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్నట్లు తేలింది. మెక్సికో, క్యూబా లోని పరిశోధకులు కొన్ని జాతుల తేళ్ల విషం క్యాన్సర్ కణాలను లక్ష్యంగా చేసుకొని పనిచేస్తాయని కనిపెట్టారు. ఈ తేళ్ల విషంలో విభిన్న ప్రోటీన్లు, పెప్టైడ్లు ఉన్నట్టు గుర్తించారు. క్యాన్సర్ కణాలపై ప్రభావం చూపిస్తాయని గుర్తించారు. అందుకే క్యాన్సర్ ఔషధాల్లో తేలు విషయాన్ని వినియోగిస్తున్నారు. ఊపిరితిత్తుల క్యాన్సర్, ప్రాంక్రియాస్ క్యాన్సర్, పొట్ట క్యాన్సర్, మెదడు క్యాన్సర్ పై తేలు విషంతో చేసిన క్యాన్సర్ ఔషధాలు మంచి ఫలితాలను అందించినట్టు అధ్యయనకర్తలు చెబుతున్నారు. అయితే రక్తం ఆధారిత క్యాన్సర్ల పై మాత్రం ఇది సరిగ్గా పని చేయడం లేదు, అంటే బ్లడ్ క్యాన్సర్ వంటి వాటిపై తేలు విషం అంత ప్రభావంతంగా పనిచేయడం లేదు.

Related Articles

Stay Connected

0FansLike
0FollowersFollow
0SubscribersSubscribe
- Advertisement -spot_img

Telangana