posted on Sep 17, 2024 6:33AM
గల్ఫ్ కార్మికుల సంక్షేమం కోసం ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. గల్ఫ్ లో చనిపోయిన వారి కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్ గ్రేషియా ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు శనివారం (సెప్టెంబర్ 14) బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ అధ్యక్షతన గల్ఫ్ కార్మికులు అధికంగా ఉండే నియోజక వర్గ ఎమ్మెల్యేలు ఇతర ముఖ్య నేతలతో శనివారం సమావేశాన్ని నిర్వహించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు ప్రజాభవన్ లో జరిగిన ఈ సమావేశంలో హైదరాబాద్ ప్రజా భవన్ లో ప్రతి మంగళవారం , శుక్రవారం ప్రజావాణి లో గల్ఫ్ కార్మికుల కోసం ప్రవాసి ప్రజావాణి కూడా నిర్వహించాలని నిర్ణయించారు. బతుకుతెరువు కోసం తెలంగాణలోని వివిధ జిల్లాల నుంచి గల్ఫ్ దేశాలకు వెళ్ళిన తర్వాత అక్కడ పడుతున్న బాధలు, వేర్వేరు కారణాలతో అక్కడ మృతి చెందే ఘటనలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం వారి కుటుంబాలను ఆదుకోడానికి ఈ నిర్ణయం తీసుకున్నదని మంత్రి పొన్నం ప్రభాకర్ తెలిపారు. .