2. పోషకాలు:
తేనెలో యాంటీ ఆక్సిడెంట్లు, ఎంజైమ్లు, క్యాల్షియం, ఐరన్, మెగ్నీషియం లాంటి మినరళ్లు పుష్కలంగా ఉంటాయి. ఇవి జీర్ణక్రియను మెరుగుపరుస్తాయి. దాంతో సహజంగానే బరువు తగ్గడానికి సాయం అవుతుంది. బెల్లంలో కూడా ఐరన్, మెగ్నీషియం, పొటాషియం ఉంటాయి. దీంట్లో ఎంజైమ్లు, యాంటీ ఆక్సిడెంట్లు తేనెలో ఉన్నట్లు ఉండవు.