Home తెలంగాణ ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు .. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ...

ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు .. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు | andhra pradesh panchayat ministry world record| 13326| framasabhalu| single| day| world| recorda| union| recognise| present| medal

0

posted on Sep 16, 2024 3:59PM

పని చేయాలన్న చిత్తశుద్ధి, ప్రజలకు సేవ చేయాలన్న సంకల్పం ఉండాలే కానీ.. ప్రభుత్వాలు అద్భుతాలు చేయవచ్చునని ఆంధ్రప్రదేశ్ లోని తెలుగుదేశం కూటమి ప్రభుత్వం రుజువు చేస్తున్నది. ముఖ్యంగా తొలి సారి మంత్రి పదవి చేపట్టిన జనసేన అధినేత పవన్ కల్యాణ్ తన శాఖ పని తీరును గణనీయంగా మెరుగుపరిచారు.  

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిర్వహిస్తున్న పంచాయతీరాజ్ శాఖ ప్రపంచ రికార్డు సాధించింది. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించింది. వరల్డ్ రికార్డ్స్ యూనియన్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సాధించిన ఈ ఘనతను గుర్తించింది. ఆ యూనియన్ ప్రతినిథులు సోమవారం (సెప్టెంబర్ 16) హైదరాబాద్ లో జరిగిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ శాఖ మంత్రి పవన్ కల్యాణ్ కు ఒక సర్టిఫికెట్, మెడల్ బహూకరించారు.

ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం కొలువుదీరి,  పంచాయతీరాజ్ శాఖ మంత్రిగా పవన్ కల్యాణ్ పదవీ బాధ్యతలు స్వీకరించి పూర్తిగా వంద రోజులు కూడా కాలేదు. వంద రోజులలోపుగానే ఒకే రోజు 13 వేల 326 గ్రామ సభలు నిర్వహించి ప్రపంచ రికార్డు సాధించడం విశేషం.  

Exit mobile version