ఎవరు ఏం అనుకున్నా.. జగన్ మాత్రం ఐప్యాక్‌కు మళ్లీ ఛాన్స్ ఇవ్వాలనే ఉద్దేశంతో ఉన్నట్టు సమాచారం. ఎందుకంటే.. 2024 ఎన్నికల ముందు ఐప్యాక్ డిజైన్ చేసిన క్యాంపెయిన్లు జగన్‌కు నచ్చినట్టు కొందరు వైసీపీ నేతలు చెబుతున్నారు. ముఖ్యంగా.. ‘జగనన్నే మా భవిష్యత్తు’, ‘మా నమ్మకం నువ్వే జగన్’, ‘జగనన్న సురక్ష’, ‘జగనన్న ఆరోగ్య సురక్ష’ ‘వై ఏపీ నీడ్స్ జగన్’ ‘సిద్ధం’, ‘మేమంతా సిద్ధం’ వంటి క్యాంపెయిన్లు డిజైన్ చేయడంలో ఐప్యాక్ కీలక పాత్ర పోషించినట్టు వైసీపీ నేతలు చెబుతున్నారు.