Home లైఫ్ స్టైల్ నా ఏడేళ్ల పాపకి తరచూ మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్ వస్తోంది, కారణమేంటి?-health questions and...

నా ఏడేళ్ల పాపకి తరచూ మూత్రంలో మంట, మూత్రనాళ ఇన్ఫెక్షన్ వస్తోంది, కారణమేంటి?-health questions and answers related to pregnancy water break and uti in children ,లైఫ్‌స్టైల్ న్యూస్

0

2. నా కూతురికి ఏడేళ్లు. కొంతకాలంగా తరచూ యూటీఐలతో బాధపడుతోంది. మూత్రంలో మంట అంటోంది. ఇంత చిన్న అమ్మాయికి యుటిఐ ఉండటం సాధారణమేనా? ఈ సమస్య శాశ్వతంగా పోవడానికి ఏం చేయాలి?

మూత్రనాళ ఇన్ఫెక్షన్ (యుటిఐ) ఏ వయస్సులోనైనా రావచ్చు. ఈ ఇన్ఫెక్షన్ వల్లే మూత్రం వెళ్లేటప్పుడ మంట వస్తుంది. అపరిశుభ్ర టాయిలెట్ల వాడకం, ప్రైవేటు భాగాల శుభ్రత విషయంలో జాగ్రత్త లేకపోవడం, తక్కువ నీరు తాగడం వల్ల పిల్లల్లోనూ యూటీఐ రావచ్చు. మీ పాపకు పదేపదే యుటిఐ వస్తుంటే, మీరు కొన్ని విషయాలపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. ప్రైవేట్ భాగాలను శుభ్రం చేయడానికి తనకి సరైన పద్ధతి నేర్పండి. పబ్లిక్ టాయిలెట్ ఉపయోగించేటప్పుడు ఎలా జాగ్రత్తగా ఉండాలో నేర్పండి.  కాటన్ లోదుస్తులు ధరించేలా చూడండి. కొన్నిసార్లు చిన్న వయస్సులోనే డయాబెటిస్ కారణంగా కూడా యుటిఐ పదేపదే వస్తుంది. ఈ దిశగా కూడా ఆలోచించాలి. ఒకసారి పిల్లల వైద్యుణ్ని కలవడం ఉత్తమం. సాధారణంగా యుటిఐలు యాంటీబయాటిక్స్‌తో నయం చేస్తారు. అయితే, యాంటీబయాటిక్స్ ఎల్లప్పుడూ వైద్య సలహాతో మాత్రమే తీసుకోవాలి.

Exit mobile version